Nidhhi Agerwal : జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన హరి హర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాటలు, టీజర్ కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఎంఎం రత్నం నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇందులో స్పెషల్ గా పవన్ కళ్యాణ్ ఓ పాట కూడా పాడారు. సినిమాలో ముఖ్య భూమిక పోషించింది ప్రముఖ నటి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal). ఈ సందర్బంగా చిట్ చాట్ చేసింది. తన మనసులో మాటను బయట పెట్టింది.
Nidhhi Agerwal Comments
తన సినీ కెరీర్ లో హరి హర వీరమల్లు ఒక మైలురాయిగా నిలిచి పోతుందని స్పష్టం చేసింది నటి. ఇందులో తన పాత్ర పంచమి ప్రతి ఒక్కరిని పలకరిస్తుందని పేర్కొంది. తనకు నటించేందుకు అవకాశం ఇచ్చినందుకు నిర్మాత రత్నం కు, దర్శకుడు జ్యోతి కృష్ణకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెప్పింది నిధి అగర్వాల్. తప్పకుండా ఈ మూవీ జనాదరణ పొందుతుందని నమ్మకం వ్యక్తం చేసింది.
చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో మెగా, పవన్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు నిర్మాత ఎంఎం రత్నం. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పారు. ఇక మిగిలింది ప్రేక్షకుల ముందుకు రావడమేనని పేర్కొన్నారు. భారీ ఎత్తున ఖర్చు చేశామన్నాడు. జ్యోతి కృష్ణ తన ప్రతిభతో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు.
Also Read : Hero Vishal Serious : నెగటివ్ రివ్యూస్ విశాల్ సీరియస్
