Hero Vishal Serious : నెగ‌టివ్ రివ్యూస్ విశాల్ సీరియ‌స్

ఇలా చేస్తే సినిమాలు బ‌తుకుతాయా

Hello Telugu - Hero Vishal Serious

Hello Telugu - Hero Vishal Serious

Hero Vishal : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టుడు, నిర్మాత విశాల్ రెడ్డి (Hero Vishal) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేకించి సినిమాల‌కు సంబంధించి వ‌స్తున్న రివ్యూలపై తీవ్రంగా స్పందించారు. ఒక సినిమా బ‌య‌ట‌కు రావ‌డానికి ఎన్నో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. వంద‌ల కోట్ల ఖ‌ర్చుతో సినిమాలు తీయాల్సి వ‌స్తోంద‌ని, వీటిపై ఎలాంటి అంచ‌నాలు లేకుండా త‌మ స్వంత ఆలోచ‌న‌ల‌ను రుద్దుతూ రివ్యూస్ (సమీక్ష‌) చేప‌ట్ట‌డం ప‌ట్ల అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. అయితే కొంద‌రు అద్భుతంగా రాస్తున్నార‌ని, కానీ చాలా మంది పూర్తిగా వ్య‌తిరేక‌త ఉండేలా , ప్రేక్ష‌కుల‌ను క‌న్ ఫ్యూజ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ వాపోయారు న‌టుడు విశాల్ రెడ్డి.

Hero Vishal Serious Comments

దీని వ‌ల్ల నిర్మాత‌లు ఎక్కువ‌గా న‌ష్ట పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌తి ఏటా వంద‌ల సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయ‌ని, వాటిలో కొన్ని మాత్ర‌మే స‌క్సెస్ అవుతున్నాయ‌ని, మిగ‌తావి అంత‌గా ఆద‌ర‌ణ‌కు నోచుకోవ‌డం లేద‌ని పేర్కొన్నాడు న‌టుడు. ఇక‌నుంచైనా సినీ విమ‌ర్శ‌కులు, విశ్లేష‌కులు , ఆలోచ‌న‌ప‌రులు , బుద్ది జీవులు, సినిమాల మీద ప్రేమ క‌లిగిన వాళ్లు సినిమా రంగాన్ని ప్రోత్స‌హించేలా ఉండాలే త‌ప్పా దానికి వ్య‌తిరేకంగా ఉండ కూడ‌ద‌ని సూచించాడు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్దతి కాద‌న్నాడు. కావాల‌ని, వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసేలా రివ్యూస్ ఉంటున్నాయ‌ని పేర్కొన్నాడు. వాటి ప‌ట్ల‌నే త‌న‌కు అభ్యంత‌రం ఉంద‌న్నాడు విశాల్ రెడ్డి.

Also Read : Beauty Tripti Dimri : ప్ర‌భాస్ తో క‌లిసి న‌టిస్తానన‌ని అనుకోలేదు

Exit mobile version