హైదరాబాద్ : నేషనల్ క్రష్ రష్మిక మందన్న సీరియస్ గా స్పందించింది. తాజాగా తన గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కొనసాగుతుండడాన్ని గమనించింది. ఈ మేరకు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు విజయ్ దేవరకొండకు మధ్య ఉన్న బంధం పెవికోల్ కంటే గట్టిగా ఉంటుందని పేర్కొంది. తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు, హోస్ట్ కరణ్ జోహార్ నిర్వహిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చారు. అయితే ఓ ప్రశ్నకు సమాధానంగా ఎవరి నిర్ణయాలు వారే తీసుకుంటారని తెలిపారు. ఇద్దరికి ఒకరంటే మరొకరికి పిచ్చి ప్రేమ అని కూడా చెప్పారు. ఇదే సమయంలో కరణ్ జోహార్ ఓ ప్రశ్న వేశాడు. అదేమిటంటే ఇద్దరిలో ఎవరు ముందుగా ఐ లవ్ యు చెప్పారని. దీనికి సమాధానం ఇస్తూ తనను పెళ్లి చేసుకోమంటూ 100 సార్లు అడిగించుకున్నాడని విజయ్ దేవరకొండ గురించి ఆరోపించింది.
ఇది పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. ఈ విషయం నిజమేనంటూ దేవరకొండ కూడా ఒప్పుకున్నాడు. దీంతో ఇలా చేస్తారా అంటూ రష్మిక మందన్న అభిమానులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సామాజిక మాధ్యమాలలో విజయ్ దేవరకొండను ఏకి పారేశారు. దీంతో రష్మిక స్మూత్ గా స్పందిస్తూనే వారికి రిప్లై ఇచ్చింది. తామిద్దరం కలిసి తొలిసారిగా గీత గోవిందం మూవీలో పని చేశామని, ఆ సమయంలోనే మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని తెలిపింది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు డేటింగ్ లో ఉన్నామని, చివరకు తాను ముందుగా విజయ్ దేవరకొండకు ప్రపోజ్ చేశానని, అయినా తను ఎక్కువగా స్పందించ లేదని తెలిపింది. చివరకు తను ఓకే చెప్పాడని, పెళ్లి జరిగి పోయిందని వెల్లడించింది. ఇక నుంచి తాము కలిసే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపింది. దీంతో వివాదానికి ముగింపు పలికింది ఈ ముద్దుగుమ్మ.
