Hydraa : హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఆక్రమణలకు పాల్పడే వారిని ఉపేక్షించే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. తాట తీస్తామన్నారు. అనుమతులు లేని లే ఔట్లలో రహదారులు, పార్కులు ఆక్రమణకు గురౌతున్నాయని బాధితులు తమకు విన్నవించారని తెలిపారు. హైడ్రా (Hydraa) ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రజా వాణి నిర్వహిస్తూ వస్తున్నారు. 60 అడుగుల వెడల్పుతో ఉండాల్సిన రహదారులను ఇరువైపులా ఆక్రమించుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు కమిషనర్. చుట్టు పక్కలన దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారని, ఖాళీ చేయమంటే దాడి చేస్తున్నారంటూ వాపోయినట్లు తెలిపారు.
Hydraa Commission Strong Warning
అయితే అనుమతి లేని లేఔట్లలో ప్లాట్లు కొని సరైన రహదారులు, పార్కులు లేక ఇబ్బందులు పడొద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌గారు సూచించారు.హెచ్ ఎండీఏ, డీటీసీపీ అనుమతి పొందిన లే ఔట్లలో ప్లాట్లు కొంటే రహదారులు, పార్కులు నిర్దేశిత లెక్కల ప్రకారం ఉంటాయన్నారు. బొల్లారం మున్సిపాలిటీలోని ఎన్‌రిచ్ ప్రాంతంలో సర్వే నంబరు 83లో వరకుంట చెరువు కబ్జాలను నివారించాలని కోరారన్నారు. బాచుపల్లి మండలంలోని నిజాంపేట సర్వే నంబరు 233/15లో ప్రభుత్వ భూమి కబ్జా అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారని చెప్పారు. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహార్‌నగర్ విలేజ్‌లో తన తండ్రి ఆర్మీ ఉద్యోగి కావడంతో అప్పట్లో ఇచ్చిన భూమిని స్థానికంగా ఉన్నవారు కబ్జా చేసేశారని అతని కుమారుడు వినతిపత్రం ఇచ్చారని చెప్పారు ఏవీ రంగనాథ్. కాగా హైడ్రా ప్రజావాణికి మొత్తం 41 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఇందులో ఎక్కువగా రహదారులు, పార్కుల ఆక్రమణలే ఉన్నాయన్నారు.
Also Read : IND vs AUS T20 Squad Interesting : భారత జట్టుతో ఆడే ఆసిస్ జట్ల ప్రకటన
