అర్హులందరికీ పక్కా గృహాలు అందిస్తాం : పార్థ‌సారథి

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహనిర్మాణ శాఖామాత్యులు

hellotelugu-KolusuParthasarathy

అమరావతి : రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు అందించే లక్ష్యంతో ఈప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సమచార పౌర సంబంధాలు,గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. పేదలకు పక్కా గృహాలు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు కేంద్రం నుంచి అధిక నిధులు సాధించి వారి సొంత ఇంటి కల నిజం చేయడానికి శ్రాయశక్తులా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2014-19 మధ్య మొత్తం 13,04,516 ఇళ్లు మంజూరు చేస్తే 10వేల 194 కోట్ల రూ.లు ఖర్చు చేసి 8,04,853 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.

అందరికి ఇళ్లు అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఆనాడు రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఎస్సీ,ఎస్టీ, బీసీలు ఇళ్ల నిర్మాణంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 712.83 కోట్లు అదనపు ఆర్థిక సాయం అందించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇంటికి రూ.50వేల చొప్పున, ఆదివాసి గిరిజనులకు ఇంటికి రూ.75 వేల చొప్పున అందించి వారికి చేయుత నివ్వడం జరిగిందని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాలనలో పరిశీలిస్తే 18లక్షల 61వేల గృహాలు మంజూరు చేయగా ఆ ప్రభుత్వ పాలన పూర్తయ్యే నాటికి అనగా 2024 మే 31 నాటికి 9వేల 588 కోట్ల రూ.లు ఖర్చు చేసి కేవలం 6లక్షల 70వేల 636 ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగారని మంత్రి పార్ధ సారధి పేర్కొన్నారు.

Exit mobile version