IND vs AUS : ఆస్ట్రేలియా : బలమైన భారత జట్టుతో తలపడనుంది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. ఈ మేరకు టీమిండియా వన్డే సీరీస్ తో పాటు టి20 సీరీస్ ఆడనుంది. ఇప్పటికే బీసీసీఐ (BCCI) ఆసిస్ తో ఆడే జట్లను వేర్వేరుగా ప్రకటించింది. వన్డే జట్టుకు అనూహ్యంగా శుభ్ మన్ గిల్ కు బాధ్యతలు అప్పగించింది. మరో వైపు ఆసియా కప్ ఛాంపియన్ గా నిలవడంతో కీలక పాత్ర పోషించిన జట్టును కొనసాగించేందుకు ఓకే చెప్పింది. ఈ జట్టుకు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు.
IND vs AUS T20 Squad Updates
దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది మంగళవారం. ఈ మేరకు అధికారికంగా వన్డే సీరీస్ ఓ జట్టును, టి20 సీరీస్ కు మరో జట్టును ప్రకటించింది. అయితే ఈ రెండు సీరీస్ లక మిచెల్ మార్ష్ ను కెప్టెన్ గా నియమించడం విశేషం. ఇదిలా ఉండగా పాట్ కమ్మిన్స్ గాయపడడంతో తను ఆటకు దూరంగా ఉన్నాడని, తన స్థానంలో మిచెల్ మార్ష్ అయితేనే బాగుంటుందని తనను స్కిప్పర్ గా ఎంపిక చేసినట్లు తెలిపింది బోర్డు.
ఇదిలా ఉండగా జట్ల పరంగా చూస్తే ఇలా ఉన్నాయి. ఆస్ట్రేలియా వన్డే జట్టుకు మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా ఆడతారు.
టి20 జట్టు కేవలం రెండు మ్యాచ్ లకు మాత్రమే ప్రకటించింది ఏసీబీ. మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ఉన్నారు.
Also Read : Trump Tariffs Sensational : నవంబర్ 1 నుంచి వాటిపై కూడా 25% సుంకాలు
