Hydraa : హైదరాబాద్ : ఆక్రమణలపై హైడ్రా దూకుడు పెంచింది. బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. పెద్ద ఎత్తున హైడ్రాకు తరలి వస్తున్నారు. తమ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని. తాజాగా హైడ్రా (Hydraa) నిర్వహించిన ప్రజా వాణికి 26 ఫిర్యాదులు వచ్చాయని హైడ్రా అదనపు కమిషనర్ అశోక్ కుమార్. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం రేణుక యెల్లమ్మ కాలనీలో 1600ల గజాల పార్కు స్థలంతో పాటు.. ప్రజావసరాలకు ఉద్దేశించిన 800 గజాల స్థలం కబ్జాకుగురి అవుతోందని.. స్థానికంగా అధికారులకు పిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని.. హైడ్రా అధికారులు జోక్యం చేసుకుని ఆ స్థలాలను కాపాడాలని ఆ కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు హైడ్రాకు పిర్యాదు చేశారు.
Hydraa Shocking Updates
ఇదిలా ఉండగా మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండలం మూసాపేటలోని అంజయ్య నగర్‌లో ఉన్న పార్కును కాపాడినందుకు హైడ్రాకు అక్కడి నివాసితులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఈ పార్కు అభివృద్ధికి రూ. 50 లక్షలు జీహెచ్ ఎంసీ కేటాయించి పనులు చేపడితే కొంతమంది అడ్డుకోవడం జరిగిందన్నారు. దీంతో పనులు ఆపేసి అలాగే వెళ్లిపోయిన జీహెచ్ ఎంసీ అధికారులు. ఇప్పుడు కబ్జాలు తొలగినా పార్కు అభివృద్ధిపై దృష్టి పెట్టక పోవడం బాధాకరమని ప్రజావాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన రూ. 50 లక్షల కోసం మళ్లీ ప్రతిపాదనలు పంపామని కాలయాపన చేస్తున్నారని వాపోయారు. దీంతో పార్కు ఉండి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప్పల్ మండలం బండ్లగూడ నాగోల్ సర్వే నంబరు 36/6 లో ఉన్న ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 35/5 ను చూపించి అనుమతులు తెచ్చుకుని 36/6 లోని 3 ఎకరాల ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. స్థానిక అధికారులకు ఈ విషయం తెలిసినా చర్యలు తీసుకోవడంలేదని వాపోయారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి హైడ్రా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Also Read : Minister Atchannaidu Interesting Update : ఏపీకి 41,170 మెట్రిక్ టన్నుల యూరియా
