Telangana : హైదరాబాద్ – భారీ వర్షాల దెబ్బకు తెలంగాణ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. తెలంగాణ (Telangana) ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ-మధ్య, వాయవ్య బంగాళా ఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. అల్పపీడనం శుక్రవారం నాటికి మరింత బలపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి యాదాద్రి భువనగిరి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను ముంచెత్తాయి. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ ఎలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో ఒక్కో చోట అతి నుంచి అత్యంత భారీ వర్షాలు.. కుంభవృష్టి కురిసే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది.
Telangana Heavy Rains
కొన్ని చోట్ల 20 సెంటీ మీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. అంతే కాకుండా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. జీహెచ్ఎంసీ పరిధిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆదిలాబాద్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు జిల్లా కలెక్టర్. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే బయటకు రావద్దని కోరారు.
మరో వైపు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
Also Raed : AP Govt Approved : ఏపీలో పర్మిట్ రూమ్‌లకు అనుమతి
