AP Govt Approved : ఏపీలో పర్మిట్ రూమ్‌లకు అనుమతి

మందు బాబుల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

Hello Telugu - AP Govt Approved

Hello Telugu - AP Govt Approved

AP Govt : అమ‌రావ‌తి – ఏపీ స‌ర్కార్ మందు బాబుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఇప్ప‌టికే ధ‌ర‌లు భారీగా పెంచింది. మ‌రో వైపు కొత్త‌గా మ‌ద్యం దుకాణాల‌కు సంబంధించి లైసెన్సుల ధ‌ర‌ల‌ను ఖ‌రారు చేసింది. ఇందులో భాగంగా మ‌ద్యం ప్రియుల‌కు మేలు చేకూర్చేలా, ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఉండేందుకు గాను ఎక్క‌డిక‌క్క‌డే కూర్చుని తాగేందుకు వీలు క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా పర్మిట్ రూమ్ ల‌కు ప‌ర్మిష‌న్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కాగా ఫారమ్ A-4(B)లోని నిబంధనలను స్ప‌ష్టం చేసింది. ఫారమ్ A-4లోని లైసెన్స్ హోల్డర్‌కు A-4 లైసెన్స్ పొందిన ప్రాంగణానికి ఆనుకుని ఉన్న ప్రత్యేక అనుమతి ఉన్న ప్రాంగణంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, ఫారిన్ లిక్కర్‌ను వినియోగించు కోవడానికి వీలు కుదురుతుంది. దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది ఏపీ కూట‌మి స‌ర్కార్ (AP Govt).

AP Govt Approved

ప‌ర్మిట్ రూమ్ ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి కొన్ని నిబంధ‌న‌లు విధించింది. రూల్ 23లో, ఫారమ్ A-4 పదాల తర్వాత ఫారమ్ A-4(B)లోని పర్మిట్ రూమ్ కోసం అనే పదాలు చేర్చాలని పేర్కొంది. రూల్ 24 తర్వాత కింది కొత్త రూల్ 24-A (పర్మిట్ రూమ్) చేర్చాలని తెలిపింది స‌ర్కార్. రూల్ 24-A (పర్మిట్ రూమ్)కు గాను ఫారమ్ A-4లోని లైసెన్స్ హోల్డర్ వర్తించే రిటైల్ ఎక్సైజ్ పన్ను చెల్లించిన తర్వాత పర్మిట్ రూమ్ కలిగి ఉండటానికి ఫారమ్ A-4(B)లో లైసెన్స్ పొందాలని వెల్ల‌డించింది . ఫారమ్ A-4లో లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తి పర్మిట్ రూమ్ కోసం లైసెన్స్ మంజూరు కోసం ఫారమ్ A-4(A)లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

పర్మిట్ రూమ్ కోసం ఎంపిక చేయబడిన ప్రాంగణం, పారిశుధ్యం, హ్యాండ్ వాష్, తాగునీటి సౌకర్యాలతో మద్యం సేవించడానికి ఉన్న A-4 షాప్ లైసెన్స్ పొందిన ప్రాంగణానికి ప‌క్క‌నే ఉండాలని, అంతే కాకుండా 1000 చదరపు అడుగులకు మించి ఉండ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. అయితే కీల‌క నిబంధ‌న విధించింది. ప‌ర్మిట్ రూమ్ లో వంట గ‌ది వాడ‌కూడ‌ద‌ని, కానీ తినేందుకు సిద్దంగా ఉన్న స్నాక్స్ ను అనుమ‌తించాల‌ని పేర్కొంది.

Also Read : Pulichintala Project Danger : పులిచింతల ప్రాజెక్ట్ వరద హెచ్చరిక

Exit mobile version