AP-Telangana Heavy Rains Warning : తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు హై అల‌ర్ట్

హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ..జ‌ర భ‌ద్రం

Hello Telugu - AP-Telangana Heavy Rains Warning

Hello Telugu - AP-Telangana Heavy Rains Warning

Heavy Rains : బంగళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం వ‌ల్ల భారీ ఎత్తున వ‌ర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. అటు ఏపీలో ఇటు తెలంగాణ‌లో కుండ పోత గా కురుస్తున్నాయి. వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. మ‌త్త‌డి దుంకుతుండ‌డంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్లు హెచ్చ‌రిస్తున్నారు. ప్ర‌కాశం బ్యారేజీ, శ్రీ‌శైలం, నాగార్జున సాగ‌ర్, తుంగ‌భ‌ద్ర‌, సుంకేశుల‌, గాజుల‌దిన్నె , జూరాల‌, స‌ర‌ళాసాగ‌ర్, త‌దిత‌ర ప్రాజెక్టుల‌న్నీ నిండు కుండ‌ల‌ను త‌ల‌పింప చేస్తున్నాయి. దీంతో మ‌రో 72 గంట‌ల‌పాటు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించింది వాతావ‌ర‌ణ కేంద్రం. ఆగ‌స్టు 15తో పాటు 16వ తేదీల‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళా ఖాతంలో అల్పపీడన వ్యవస్థ బలపడి, ఆ ప్రాంతంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

AP & Telangan Heavy Rains Warning

కాగా ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం ప‌లు జిల్లాలకు ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేసింది. ప‌ల్నాడు జిల్లాలో ఆకస్మిక వరద ముప్పు కారణంగా పౌరులు అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థించారు. ప్ర‌కాశం జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రించింది వాతావ‌ర‌ణ శాఖ‌. నంద్యాల జిల్లాలో ఆకస్మిక వరదలు ఈ ప్రాంతాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి . పౌరులు అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థించారు. ఏలూరు జిల్లాలో రాబోయే 24 గంటల్లో 7-12 సెం.మీ వర్షపాతం నమోదవుతుందని అంచనా. ఎన్టీఆర్ జిల్లాతో పాటు శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, పార్వ‌తీపురం, అల్లూరి సీతారామ‌రాజు, క‌ర్నూలు జిల్లాల్లో వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణ‌లో ఉత్త‌ర జిల్లాల‌తో పాటు 12 జిల్లాల‌కు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. తక్షణ అవసరం ఉంటే ప్రజలు 112, 1070 అత్యవసర హెల్ప్‌లైన్‌లను సంప్రదించాల‌ని కోరింది వాతావ‌ర‌ణ శాఖ‌.

Also Read : TG Police Raju Naik Proven : రాజు నాయ‌క్ కు కేంద్రం శౌర్య ప‌త‌కం

Exit mobile version