TG Police Raju Naik Proven : రాజు నాయ‌క్ కు కేంద్రం శౌర్య ప‌త‌కం

అత్యంత ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించాడు

Hello Telugu - TG Police Raju Naik Proven

Hello Telugu - TG Police Raju Naik Proven

Raju Naik : 79వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దేశ వ్యాప్తంగా అత్యంత ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించిన వారికి శౌర్య ప‌త‌కాల‌ను ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ గా ప‌ని చేస్తున్న రాజు నాయ‌క్ (Raju Naik) కు అరుదైన గౌర‌వం ల‌భించింది. త‌న ధైర్యానికి మెచ్చి శౌర్య ప‌త‌కాన్ని ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా రాజు నాయ‌క్ త‌న విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెట్టేందుకు వెనుకాడ లేదు. ఇంకొక‌రైతే వెన‌క్కి వెళ్లి ఉండే వారు. కానీ రాజు నాయ‌క్ అత్యంత ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శించాడు. త‌న వృత్తి ధ‌ర్మానికి న్యాయం చేశాడు.

Head Conistable Raju Naik Get Award

2023 సంవ‌త్స‌రంలో హైద‌రాబాద్ లోని నార్సింగ్ ఓఆర్ఆర్ స‌మీపంలో దంప‌తుల‌ను హ‌త్య చేసి ప‌రారైన నిందితుడు క‌ర‌ణ్ ను రాజు నాయ‌క్ గాలించి, ప‌ట్టుకున్నారు. ఆ టైంలో తన ఛాతీ, తలపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. ఓ వైపు రక్తం కారుతున్నా రాజు అతణ్ని వదల్లేదు. తోటి పోలీసుల సాయంతో అరెస్ట్ చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజు నాయ‌క్ ను హుటా హుటిన పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ కోలుకున్నాడు. త‌న‌కు మూడు చోట్ల స‌ర్జ‌రీలు చేసి బ‌తికించారు. ప్ర‌స్తుతం రాజు నాయ‌క్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. ఈ సంద‌ర్బంగా త‌న ధైర్య సాహ‌సాలు తోటి కానిస్టేబుళ్ల‌కు, పోలీసు యంత్రానికి స్పూర్తి దాయ‌కంగా నిలుస్తోంది. ఈ సంద‌ర్బంగా డీజీపీతో పాటు సీఎం ఎ. రేవంత్ రెడ్డి, త‌దిత‌రులు అభినందించారు రాజు నాయ‌క్ ను.

Also Read : Deputy CM Pawan Kalyan Proven : సుస్థిర పాలనతోనే సంక్షేమం సాధ్యం

Exit mobile version