హైదరాబాద్ : టాలీవుడ్ లో అత్యంత జనాదరణ పొందిన అగ్ర దర్శకుడు సుకుమార్. మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన నటుడు రామ్ చరణ్ తో కలిసి కొత్తగా మూవీ రూపొందించే పనిలో పడ్డారు . ఈ సినిమాకు సంబంధించి రోజుకు ఒక అప్ డేట్ వస్తోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి . ఇదిలా ఉండగా దురంధర్ మూవీలో అద్భుతంగా నటించి ప్రశంసలు పొందిన అందాల ముద్దుగుమ్మ సారా అర్జున్ ను కూడా సుకుమార్ తను రామ్ చరణ్ తో తీయబోయే తదుపరి చిత్రం కోసం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా మరొకరి పేరు హల్ చల్ చేస్తోంది. ఇక సుకుమార్, చెర్రీలు కలిసి రంగస్థలం మూవీ చేశారు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అవార్డులను పొందేలా చేసింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో చెర్రీతో పాటు పోటీపడి నటించి మెప్పించింది అందాల తార సమంత రుత్ ప్రభు.
ఇప్పుడు బన్నీతో పుష్ప తర్వాత చెర్రీతో కొత్త సినిమా చేయబోతున్నట్లు ఇప్పటికే సంచలన ప్రకటన చేశాడు దర్శకుడు సుకుమార్. ఇక ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తుండగా, ఇందులో కథానాయిక ఎవరనే అంశంపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ‘సయ్యారా’ చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నటి అనిత్ పడ్డా పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం ఇంకా ప్రారంభం కాని ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం అనిత్ పడ్డాను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న ఒక వీడియోలో, సుకుమార్ కథానాయిక పేరుకు సంబంధించి ఏపీ అనే అక్షరాలను సూచించినట్లు పేర్కొన్నారు. దీనితో ఆయన అనిత్ పడ్డా గురించే అయి ఉంటుందని పేర్కొంటున్నారు.
ఈ వార్తలు నిజమైతే అనిత్ పడ్డా మొదటిసారిగా రామ్ చరణ్‌తో కలిసి నటించే అవకాశం ఉంటుంది. ఇది ఆమెకు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన ఉనికిని చాటుకోవడానికి ఒక మంచి అవకాశంగా మారుతుంది. ఇంకోవైపు ఈ చిత్రానికి సంబంధించి అనిత్ పడ్డా పేరే కాకుండా సారా అర్జున్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఏది ఏమైనా ఇంకా ఎవరు హీరోయిన్ అనే దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

















