న్యూఢిల్లీ : ప్రముఖ పంజాబీ పాప్ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజేకు కోలుకోలేని షాక్ తగిలింది. అక్టోబర్ 30 కచేరీకి ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయకుడి ‘ఆరా వరల్డ్ టూర్’లో భాగంగా ఢిల్లీలో జరగాల్సిన కచేరీకి భద్రతాపరమైన ఆందోళనలు, పండుగ సీజన్‌ను కారణంగా చూపుతూ పోలీసులు అనుమతిని నిలిపి వేశారు. పంజాబీ గాయకుడు దిల్జిత్ దోసాంజ్ 30న జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరగాల్సిన కచేరీకి, భద్రతాపరమైన ఆందోళనలు , పండుగ సీజన్‌ను కారణంగా చూపుతూ ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో అతని భారత పర్యటన ప్రారంభ ప్రదర్శన ప్రశ్నార్థకంగా మారింది.
ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారని ఒక అధికారి శుక్రవారం తెలిపారు. పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవుతారని భావించిన ఈ సంగీత కార్యక్రమానికి ముందు ఈ నిర్ణయం వెలువడింది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతిని నిలిపి వేశారు, అయితే ఈ నిర్ణయం వెనుక గల కారణాలకు సంబంధించిన మరిన్ని వివరాలు వెంటనే అందుబాటులో లేవు. దిల్జిత్ ‘ఆరా వరల్డ్ టూర్’లో భాగంగా భారతదేశంలో జరగాల్సిన పర్యటనను ఢిల్లీ ప్రదర్శనతో ప్రారంభించి, ఆ తర్వాత ఇండోర్, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, లక్నో, చండీగఢ్ అనే ఆరు నగరాలకు తీసుకు వెళ్లాల్సి ఉంది. ఈ ప్రపంచ పర్యటనలో భాగంగా, దిల్జిత్ ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలోని పలు దేశాలలో ప్రదర్శనలు ఇచ్చారు.


















