హైదరాబాద్ : ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ -10 రోజు రోజుకు కొత్త కొత్త ట్విస్టులతో మరింత ఆసక్తిని రేపుతోంది. కంటెస్టెంట్స్ మరింత పోటా పోటీగా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు నానా తంటాలు పడుతున్నారు. మరో వైపు బిగ్ బాస్ తెలుగు 10లో వర్షిణి కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అనధికారిక ఓటింగ్ సరళిని బట్టి చూస్తే, ఆమెకు పడే ఓట్ల సంఖ్య తగ్గడంతో, ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల ఆమె ప్రదర్శించిన ఆట తీరు, ప్రవర్తన కొంతమంది ప్రేక్షకులను నిరాశ పరిచినట్లు సమాచారం. దక్షితో పాటు వర్షిణి కూడా ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ షోలో తన వ్యక్తిత్వంతో, ఉనికితో వర్షిణి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఇటీవల ఆమె ప్రదర్శన కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైందని సమాచారం. పోటీ తీవ్రత పెరుగుతున్న కొద్దీ, హౌస్‌లో కొనసాగాలంటే కంటెస్టెంట్లు ప్రేక్షకుల మద్దతును పొందడం చాలా ముఖ్యం. ఓటింగ్ సరళిలో వర్షిణి ఉన్న స్థానం, షోలో ఆమె భవిష్యత్తుపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఇంకో వైపు ఈ వారం ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్న వారిలో దక్షి కూడా ఉన్నారు. వీరిద్దరి మధ్య నెలకొన్న పోటీ బిగ్ బాస్ తెలుగు 10 ప్రేక్షకులలో చర్చనీయాంశమైంది.
అయితే ఈ ఓటింగ్ సరళి కేవలం అనధికారికమైనవి మాత్రమే. ఎలిమినేషన్‌కు సంబంధించి నిర్వాహకులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తుది ఫలితం అనేది ప్రేక్షకుల అధికారిక ఓట్లు, షో నిర్వాహకుల ప్రకటనపైనే ఆధారపడి ఉంటుంది.



















