Haryana High Court : పంజాబ్ – నిందితుడిని కస్టడీ నుండి విడుదల చేసేందుకు కోర్టు ఇచ్చిన ఆన్లైన్ బెయిల్ ఆర్డర్ కాపీ సరిపోతుందంటూ సంచలన తీర్పు చెప్పింది పంజాబ్, హర్యానా కోర్టు (Haryana High Court). జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులకు ఎలాంటి ఆలస్యం లేకుండా న్యాయం జరగాలంటే, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసిన కోర్టు బెయిల్ ఆర్డర్ కాపీ సరిపోతుందని, కోర్టు నుండి సర్టిఫైడ్ కాపీ కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. నిందితుల తరపు న్యాయవాదులు ప్రవేశపెట్టిన ఆన్లైన్ కాపీ సరైనదేనని కోర్టు అఫిషియల్ వెబ్‌సైట్ ద్వారా అధికారులు తెలుసుకోవచ్చని సూచించింది.
Haryana High Court Comments
నిందితుడి స్వేచ్ఛను వెంటనే పునరుద్ధరించడానికి, తనను విడుదల చేయడానికి ఆన్‌లైన్ బెయిల్ ఆర్డర్ చాలని పేర్కొంది కోర్టు. ఆర్డర్ సర్టిఫైడ్ కాపీని రిజిస్ట్రీ వెంటనే పంపనప్పుడు, డౌన్‌లోడ్ చేసిన కాపీని బెయిల్ బాండ్ సమర్పించిన కోర్టు అంగీకరించాలని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అనూప్ చిత్కర , జస్టిస్ మన్దీప్ పన్నులతో కూడిన డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించచింది. బెయిల్ మంజూరు చేయబడిన లేదా శిక్షను సస్పెండ్ చేయబడిన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ప్రతి వ్యక్తికి ఎటువంటి ఆలస్యం లేకుండా వారి స్వేచ్ఛను తిరిగి పొందేలా చూసుకోవడానికి ఇది పనికి వస్తుందని అభిప్రాయపడింది.
బెయిల్ ఆర్డర్ లేదా శిక్షను సస్పెండ్ చేసే ఉత్తర్వులను రిజిస్ట్రీ, కంప్యూటర్ సిస్టమ్స్ లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంటనే పంపనప్పుడు, అటువంటి పరిస్థితిలో, ఏదైనా కోర్టు మంజూరు చేసిన స్వేచ్ఛను వెంటనే పునరుద్ధరించడానికి వీలుగా, అటువంటి అన్ని ఆదేశాల డౌన్‌లోడ్ చేసిన కాపీలను, ధృవీకరణకు లోబడి, బెయిల్ బాండ్‌లను కోర్టు అంగీకరించాలని కుండ బద్దలు కొట్టింది.
Also Read : Popular Leader Venkaiah Naidu : హస్తినలో వెంకయ్య నాయుడు బిజీ
