Harish Rao Strong Demand : జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగ‌రాలి

పిలుపునిచ్చిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

Hello Telugu - Harish Rao Strong Demand

Hello Telugu - Harish Rao Strong Demand

Harish Rao : హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ జెండా మ‌రోసారి ఎగ‌రాల‌ని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. బుధ‌వారం పెద్ద ఎత్తున నియోజ‌క‌వ‌ర్గంలోని బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు (Harish Rao) ప్ర‌సంగించారు. చేరిన వారంద‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తున్నాన‌ని అన్నారు. మాగంటి సునీత‌ను ఆశీర్వ‌దించాలి. ఆమెకు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని అన్నారు. మీ అంద‌రి ఆశీర్వాదంతో గోపీనాథ్ ఐదేళ్లు ఎమ్మెల్యేగా గ‌తంలో ఉన్నార‌ని, కానీ ఇటీవ‌లే ఆయ‌న అనారోగ్యంతో మ‌న‌మ‌ధ్య లేకుండా పోయార‌ని అన్నారు. అందుకే త‌మ పార్టీ బాస్ ఏరికోరి మాగంటి సునీత‌కు టికెట్ ఇచ్చార‌ని , తిరిగి ఆమెను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాల‌ని కోరారు.

Ex Minister Harish Rao Request

ఆ కుటుంబాన్ని నిలబెట్టాల్సిన అవ‌స‌రం మీపై ఉంద‌న్నారు. పెళ్లికాని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నార‌ని అన్నారు. భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎంతో దుఃఖంలో ఉన్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆడబిడ్డను అవమానించే విధంగా మాట్లాడటం దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానించే విధంగా నానా మాటలు మాట్లాడుతుండ‌డం వారి సంస్కారాన్ని తెలియ చేస్తుంద‌న్నారు హ‌రీశ్ రావు. విజ్ఞత మరచి విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తుంటార‌ని చెడు కంటే మంచికే ప్ర‌యారిటీ ఇస్తార‌ని, ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు.

Also Read : KTR Clear Support to BC’s Protests : బీసీ సంఘాల బంద్ కు బీఆర్ఎస్ మ‌ద్ద‌తు

Exit mobile version