KTR : హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ప్రకటన చేశారు. ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్ కు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. బుధవారం బీసీ జేఏసీ చైర్మన్ , ఎంపీ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ల ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిశారు. తమ బంద్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. జాతీయ స్థాయిలో ఓబీసీ సంక్షేమ శాఖ ఉండాలని కోరిన ఏకైక తొలి నాయకుడు కేసీఆర్ అని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పైన తమ పార్టీ విధానాన్ని ఇప్పటికే స్పష్టంగా చెప్పామన్నారు కేటీఆర్.
KTR Agreed
గతంలో శాసనసభలో రెండుసార్లు రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపించిందనని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రచారం చేసుకోలేదని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా రిజర్వేషన్లు పెడతామని శాసనసభలో చెప్పినప్పుడు మేము ఆ పార్టీ తరఫున మద్దతు ఇచ్చామన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదని అన్నారు. ఇది పూర్తిగా రాజకీయంగా లబ్ది పొందేందుకే సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ నాటకాలు ఆడుతోందని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. ఆ పార్టీ బీసీ రిజర్వేషన్ల పైన ఐదు రకాలుగా మాట్లాడుతోందని మండిపడ్డారు.
Also Read : Ponnam Prabhakar Shocking Comments : మాగంటి సునీతపై నోరు పారేసుకున్న పొన్నం
