GVMC Commissioner Interesting : ఛాయా చిత్ర ప్ర‌ద‌ర్శ‌న అద్భుతం

జీవీఎంసీ కమిషనర్ కేతన్‌ గార్గ్

Hello Telugu - GVMC Commissioner Interesting

Hello Telugu - GVMC Commissioner Interesting

GVMC Commissioner : విశాఖపట్నం – ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ఛాయా చిత్ర ప్రదర్శన తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని జీవీఎంసీ కమిషనర్ (GVMC Commissioner) కేతన్‌గార్గ్ అన్నారు. విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన రెండవ రోజుల ఫోటో ఎగ్జిబిషన్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఫోటోగ్రాఫర్ల ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను నిశితంగా పరిశీలించి ఆయన స్వయంగా తన మొబైల్ ద్వారా క్లిక్ మనిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైజాగ్ ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఆద్యంతం అద్భుతంగా ఉందన్నారు. ఈ ఎగ్జిబిషన్ ఒకవైపు నగరాభివృద్ధికి సంబంధించిన ఫోటోల‌తో పాటు మరో వైపు పలు సమస్యలను ప్రతిబింబిస్తూ, ఇంకోవైపు అనేక విజయాలకు స్ఫూర్తిగా నిలిచింది అన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తే గత ఏడాదిగా జరిగిన అనేక సంఘటనలు మనకు గుర్తుకు రావడం ఖాయం అన్నారు.

GVMC Commissioner Interesting Comments

ఫోటోగ్రాఫర్లు తీసే ఛాయా చిత్రాలు అక్కడ జరిగే సంఘటన కళ్ళకు కట్టేలా ప్రతిబింబిస్తాయని తెలియజేశారు. ఆయా ఫోటోల ద్వారా నగరంలో అభివృద్ధి చేసేందుకు దోహద పడుతుందన్నారు. వచ్చే సంవత్సరం తప్పకుండా స్క్రీన్ ద్వారా ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన ప్రతి ఒక్కరూ తిలకించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. దానికి జీవీఎంసీ (GVMC Commissioner) తరఫున సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయన్నారు. ప్రపంచ స్థాయిలో సైతం ఫోటోగ్రాఫర్స్ కు గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు రోజులు ఫోటో ఎగ్జిబిషన్ లో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. జీవీఎంసీ జోన్ త్రి జోనల్ కమిషనర్ శివప్రసాద్ మాట్లాడుతూ అద్భుతమైన రీతిలో ఫోటో ఎగ్జిబిషన్ ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాలు చూస్తుంటే ఒక్కసారిగా గత ఏడాది నుంచి ఇప్పటివరకు చోటుచేసుకున్న అనేక విషయాలు తెలుస్తున్నాయన్నారు.

కార్యక్రమంలో వైజాగ్ కమిషనర్ చేతుల మీదగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో ఉత్తమ ఫోటో జర్నలిస్టులుగా గెలుపొందిన ఫోటో జర్నలిస్టులు కమిషనర్ చేతుల మీదుగా సత్కరించి సన్మానించారు. కార్యక్రమానికి వైజాగ్ ఫోటో జర్నలిస్టుల ప్రెసిడెంట్ వై రామకృష్ణ అధ్యక్షత వహించగా సెక్రటరీ ఎండి నవాజ్, కోశాధికారి ఏ శరత్ కుమార్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Also Read : Popular Asia Cup BCCI Announce : ఆసియా క‌ప్ టీమిండియా జ‌ట్టు ఇదే

Exit mobile version