పొల్లాచ్చి : తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్రంలో కొలువు తీరిన టీవీకే పార్టీ ప్రభుత్వం పట్ల సానుకూలమైన ధోరణి ప్రదర్శించారు. గతంలో ఆయన ప్రతిపక్ష పార్టీ అధినేతగా డీఎంకే సర్కార్ ను, స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తో పాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను ఏకి పారేస్తూ వచ్చారు. ఆ తర్వాత అనుకోకుండా తాను బీజేపీ నుంచి వెళ్లి పోతున్నానని సంచలన ప్రకటన చేశారు. పీఎం మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా , జేపీ నడ్డా , నితిన్ నబిన్ కోరినా అన్నామలై పట్టించు కోలేదు. తాను వి ది లీడర్స్ పేరుతో ప్రస్తుతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా సంస్థ ఆధ్వర్యంలో పొల్లాచ్చిలో ఏర్పాటు చేసన సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే సర్కార్ ను పడిపోకుండా కాపాడు కోవాలని పిలుపునిచ్చారు.
టీవీకే పార్టీలో ఎన్నికైన వారు 15 లేదా 20 ఏళ్లుగా శాసనసభ్యులుగా ఉన్నవారు కాదు. సెంగోట్టయ్యన్ మినహా మంత్రులందరూ మొదటిసారి బాధ్యతలు చేపట్టినవారే. వారు తడబడవచ్చు, పొరపాట్లు చేయవచ్చు; అలా జరిగినప్పుడు ఒక మంచి సమాజం వారిని పైకి లేపుతుంది తప్ప, కిందకు నెట్టదు అని అన్నారు కె. అన్నామలై. తన ఉద్యమం చివరికి రాజకీయ పార్టీగా మారుతుందని పునరుద్ఘాటిస్తూ, అది అధికార రాజకీయాలకు బదులుగా ఆరోగ్యకరమైన రాజకీయాల” కోసం నిలబడుతుందని అన్నామలై చెప్పారు. గత 38 రోజుల్లో 19 లక్షల మందికి పైగా ప్రజలు ఈ ఉద్యమంలో చేరారని ఆయన చెప్పారు. ఈ సంఖ్య 50 లక్షలకు చేరినప్పుడు, తమిళనాడు ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారని, స్వాగతిస్తున్నారని అర్థం చేసుకోవాలన్నారు కె. అన్నామలై.
