Popular Asia Cup BCCI Announce : ఆసియా క‌ప్ టీమిండియా జ‌ట్టు ఇదే

వైస్ కెప్టెన్ గా శుభ్ మ‌న్ గిల్

Hello Telugu - Popular Asia Cup BCCI Announce

Hello Telugu - Popular Asia Cup BCCI Announce

BCCI : ముంబై – బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. యూఏఈ వేదిక‌గా జ‌రిగే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆసియా క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును వెల్ల‌డించింది. బీసీసీఐ ఎంపిక క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ తో పాటు సెలెక్టర్లు, జ‌ట్టు స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ మంగ‌ళ‌వారం బీసీసీఐ (BCCI) కార్యాల‌యంలో స‌మావేశం అయ్యారు. అంద‌రి అంచ‌నాలు త‌ల‌కిందులు చేస్తూ ఇంగ్లండ్ టూర్ లో దుమ్ము రేపిన‌, నాయ‌క‌త్వ నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన శుభ్ మ‌న్ గిల్ కు వైస్ కెప్టెన్ గా నియ‌మించిన‌ట్లు వెల్ల‌డించారు అజిత్ అగార్క‌ర్.

BCCI Announced Asia Cup Squad

మొత్తం 15 మంది ఆట‌గాళ్ల‌ను జ‌ట్టు కోసం ఎంపిక చేసిన‌ట్లు చెప్పారు. జ‌ట్టు ప‌రంగా చూస్తే టీమిండియాకు సూర్య కుమార్ యాద‌వ్ కెప్టెన్ కాగా వైస్ కెప్టెన్ గా శుభ్ మ‌న్ గిల్, అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, హార్తిక్ పాండ్యా, శివం దూబే, అక్ష‌ర్ ప‌టేల్, జితేష్ శ‌ర్మ (వికెట్ కీప‌ర్ ) , జ‌స్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్ , వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, కుల్దీప్ యాద‌వ్ , సంజూ శాంస‌న్ (వికెట్ కీప‌ర్ ) , హ‌ర్షిత్ రానా, రింకూ సింగ్ ఉన్నారు. అయితే అనూహ్యంగా య‌శ‌స్వి జైశ్వాల్ ను ఎంపిక చేయ‌క పోవ‌డం ఆశ్చ‌ర్య ప‌రిచింది. త‌న‌కు కొంత కాలం విశ్రాంతి ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు అజిత్ అగార్క‌ర్.

బౌలింగ్ , బ్యాటింగ్ ప‌రంగా అన్ని ఆల్ రౌండ‌ర్ల‌తో పాటు నైపుణ్యం క‌లిగిన అద్భుత‌మైన ఆట‌గాళ్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని కానీ కొంద‌రినే ఎంపిక చేయ‌డం త‌ప్ప‌లేద‌న్నారు.

Also Read : PM Modi Important Meet : షాంఘై శిఖ‌రాగ్ర స‌ద‌స్సుకు ప్ర‌ధాని మోదీ

Exit mobile version