Gone Prakash : విజయవాడ – మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు (Gone Prakash) షాకింగ్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కాం కేసులో మాజీ సీఎం జగన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు. కడప జిల్లాలో తాజాగా జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్యామ్యం ఖూనీ అయ్యిందని కామెంట్స్ చేయడం దారుణమన్నారు. తన హయాంలో ఎలా ప్రజలు ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఐదేళ్ల పాటు సాగించిన అరాచక పాలనను భరించ లేకనే, తనను , తన పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని ఆ విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
Gone Prakash Shocking Comments on Ex CM YS Jagan
తాడేపల్లి ఫ్యాలెస్ లో వందల వేల కోట్ల నగదు, బంగారం, డబ్బు దాచుకున్న జగన్ మోహన్ రెడ్డికి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు గోనె ప్రకాశ్ రావు. ఈ సందర్బంగా ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు వెంటనే తన పై దాడులు చేపట్టాలని . జగన్ అండ్ కో చెప్తున్నట్టు జెడ్పీటీసీ ఎలెక్షన్ రద్దు చేసే అవకాశం లేదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు సంచలన తీర్పు కూడా చెప్పిందన్నారు. తాను చెప్పిందే నిజమైందన్నారు. దేశంలో సూట్ కేస్ కంపెనీలు పెట్టి దోచుకున్న ముఖ్యమంత్రులు, వారి తనయులు చాలా మంది కటకటాలు లెక్కపెట్టారని , అది గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.
సూట్ కేస్ కంపెనీలు పెట్టి వందల కోట్లు డబ్బులు దోచుకున్న జగన్ మోహన్ రెడ్డి ఆ కేసుతో పాటు, లిక్కర్ కేసులో కీలకమైన పాత్ర పోషించాడని, ఈ విషయం తాను చెప్పడం లేదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వెల్లడించిందని చెప్పారు గోనె ప్రకాశ్ రావు.
Also Read : AP Govt – Farmers Subsidy Growth : ఏపీ రైతులకు వాటిపై 75% రాయితీ ప్రకటించిన సర్కార్
















