Gautam Adani Avoid : అదానీ పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ స్థానం నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా బాధ్యతలు

ఈ విషయాన్ని మంగళవారం కంపెనీ బోర్డు స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ఫైలింగ్ ద్వారా వెల్లడించింది...

Hello Telugu - Gautam Adani Avoid

Hello Telugu - Gautam Adani Avoid

Gautam Adani : భారత ప్రముఖ పారిశ్రామికవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ (Gautam Adani) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన దేశంలో అతిపెద్ద పోర్ట్ సంస్థ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మంగళవారం కంపెనీ బోర్డు స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు సమర్పించిన ఫైలింగ్ ద్వారా వెల్లడించింది.

గౌతమ్ అదానీ (Gautam Adani) ఇకపై నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పాత్రలో మాత్రమే కొనసాగనున్నారు. అంటే, ఆయన కంపెనీ యొక్క దినసరి నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా, బోర్డు స్థాయి వ్యూహాత్మక మార్గనిర్దేశకుడిగా మాత్రమే వ్యవహరిస్తారు. ఈ నిర్ణయం ఆగస్టు 5వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది.

ఈ మార్పు వల్ల గౌతమ్ అదానీ ఇకపై కంపెనీ చీఫ్ మేనేజ్‌మెంట్ పర్సనల్ (కీలక నిర్వాహక సిబ్బంది) గా పరిగణించబడరని కంపెనీ స్పష్టం చేసింది. పాలనా నిర్ణయాల్లో పాల్గొనకుండా, వ్యూహాత్మక దిశానిర్దేశం వరకు ఆయన పాత్ర పరిమితమవుతుంది.

Gautam Adani – అంతర్జాతీయ చట్టపరమైన పరిణామాల నేపథ్యంలో నిర్ణయం?

ఈ నిర్ణయం తీసుకునే ముందు అమెరికా చట్ట సంస్థల నుండి కొంత మేర చట్టపరమైన ఒత్తిడులు, ఆర్థిక ఉల్లంఘనల, లంచం ఆరోపణల దర్యాప్తుల నేపథ్యంలో గౌతమ్ అదానీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వాటికి సంబంధించి కంపెనీ కానీ, అదానీ వ్యక్తిగతంగా కానీ అధికారికంగా స్పందించలేదు.

కొత్త డైరెక్టర్‌గా మనీష్ కేజ్రీవాల్ నియామకం

అదానీ పోర్ట్స్ బోర్డు మరో కీలక నియామకాన్ని కూడా ప్రకటించింది. మనీష్ కేజ్రీవాల్‌ను మూడు సంవత్సరాల కాలానికి నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది. మనీష్ ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థకు వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ భాగస్వామిగా సేవలందిస్తున్నారు. పరిశ్రమలో ఆయనకు విశేష అనుభవం ఉంది.

ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు

తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రకారం, అదానీ పోర్ట్స్ గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ లాజిస్టిక్స్ మరియు మెరైన్ విభాగాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. లాజిస్టిక్స్ వ్యాపారం రెండింతలు, మెరైన్ వ్యాపారం సుమారు 2.9 రెట్లు పెరిగినట్లు కంపెనీ తెలిపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో అదానీ పోర్ట్స్ భవిష్యత్ వ్యూహాల్లో గౌతమ్ అదానీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, ఆయన మార్గదర్శనం మాత్రం కొనసాగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు.

Also Read : RBI Alarming – Repo Rate : రెపో రేటుపై రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన

Exit mobile version