Popular Actor Fish Venkat Death : సినీ న‌టుడు ఫిష్ వెంక‌ట్ క‌న్నుమూత‌

తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం

Hello Telugu - Popular Actor Fish Venkat Death

Hello Telugu - Popular Actor Fish Venkat Death

Fish Venkat : ప్ర‌ముఖ హాస్య న‌టుడు ఫిష్ వెంక‌ట్ తీవ్ర అనారోగ్యంతో క‌న్నుమూశారు. ఆయ‌న మృతితో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. ఆయ‌న‌కు 53 ఏళ్లు. గ‌త కొన్ని నెల‌లుగా మూత్ర పిండాల వ్యాధితో బాధ ప‌డుతున్నారు. డ‌యాల‌సిస్ చేయించుకుంటున్నారు. ఇటీవ‌లే త‌న ప‌రిస్థితి విష మించ‌డంతో వెంటిలేట‌ర్ పైనే ఉంచి చిక‌త్స చేయించారు. వైద్యులు చివ‌రి దాకా ప్ర‌యత్నం చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో తుది శ్వాస విడిచారు.

Fish Venkat No More

ఇక ఫిష్ వెంక‌ట్ (Fish Venkat) త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. సినిమాల‌లో ఆంధ్ర మాండ‌లికం ఆధిప‌త్యం వ‌హిస్తున్న స‌మ‌యంలో త‌ను తెలంగాణ మాండ‌లికంతో ఆక‌ట్టుకునే ప్ర‌యత్నం చేశాడు. హాస్య పాత్ర‌ల‌కు జీవం పోశాడు. ప్రేక్ష‌కులు త‌న‌ను ఆద‌రించ‌డం మొద‌లు పెట్టారు. 2000వ సంవత్స‌రంలో ఖుషి చిత్రంతో త‌న సినీ రంగ ప్ర‌వేశం చేశారు ఫిష్ వెంక‌ట్. ఆ తర్వాత ఆది, బ‌న్నీ, అదుర్స్, గ‌బ్బ‌ర్ సింగ్, డీజే టిల్లు , త‌దిత‌ర సినిమాల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారు.

స్ల‌మ్ డాగ్ హ‌స్పెండ్, న‌ర‌కాసుర‌, కాఫీ విత్ ఏ కిల్ల‌ర్ చిత్రాల‌లో కూడా న‌టించాడు. ఇందులో త‌న న‌ట‌న మ‌రింత ఆక‌ట్టుకుంది. అయితే కిడ్నీల‌ను బాగు చేయాలంటే క‌నీసం రూ. 50 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతుంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. చివ‌ర‌కు మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి సంద‌ర్శించారు. త‌న‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఖ‌ర్చుల‌న్నీ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని ప్ర‌క‌టించారు. త‌న వంతుగా రూ. ల‌క్ష సాయం అందించారు. కానీ త‌న‌ను కాపాడుకోలేక పోయారు. ఫిష్ వెంక‌ట్ మృతి ప‌ట్ల టాలీవుడ్ కు చెందిన సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.

Also Read : Beauty Nidhhi Agerwal : పంచ‌మి పాత్రను మ‌రిచి పోలేను – నిధి అగ‌ర్వాల్

Exit mobile version