EPFO : ఉద్యోగుల భవిష్యత్‌కు ఆర్థిక భద్రత కల్పించే పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ప్రతి ఉద్యోగికి ఒక వరంగా మారింది. ఈ పథకం మరింత సులభంగా అందుబాటులో ఉండేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ (EPFO)) తరచూ మార్పులు చేస్తూ సేవలను మెరుగుపరుస్తోంది. ఈ క్రమంలో ఆగస్టు 1వ తేదీ నుంచి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) సృష్టి కోసం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై నూతన యూఏఎన్ కోసం ఆధార్ ఆధారిత ముఖ స్కానింగ్ (ఫేస్ అథెంటికేషన్) తప్పనిసరిగా మారింది. ఈ ప్రక్రియను కేవలం ఉమాంగ్ యాప్ ద్వారా మాత్రమే నిర్వహించాలి.
EPFO – కొత్త విధానంతో ఏర్పడే సమస్యలు
ఈ నూతన నిబంధనతో కొందరికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత ఫోన్ వాడేవారు లేదా ఆధార్‌తో మొబైల్ లింక్ చేయని వారు ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోతున్నారు. ఫేస్ స్కాన్ సరిగ్గా కాకపోతే యూఏఎన్ సృష్టి ఆలస్యమవుతుంది. యూఏఎన్ లేకుండా పీఎఫ్ సేవలు అందుబాటులో ఉండవు. అయితే ఇప్పటికే యూఏఎన్ ఉన్నవారికి ఈ నియమం వర్తించదు. ఇది కేవలం కొత్త ఉద్యోగుల కోసం మాత్రమే వర్తించనుంది.
ఇబ్బందులు ఎదురయ్యేవారు:
- ఆధార్‌తో మొబైల్ లింక్ చేయని వారు – ఓటీపీ రాక సమస్యగా మారుతుంది
- స్మార్ట్‌ఫోన్ లేనివారు లేదా నీల్వ లేని కెమెరా ఉన్నవారు – ముఖ స్కాన్ చేయడం కష్టమవుతుంది
- కాంట్రాక్ట్ ఉద్యోగులను నియమించే సంస్థలు – సామూహికంగా యూఏఎన్ సృష్టించడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం
ఫేస్ అథెంటికేషన్ అవసరమేంటి?
ఒకే వ్యక్తికి రెండో యూఏఎన్ రావడం, వేరొకరి ఆధార్‌ను ఉపయోగించి యూఏఎన్ పొందడం లాంటి అవకతవకలను నివారించేందుకు ఈ పద్ధతిని తీసుకువచ్చారు. ముఖ గుర్తింపు ద్వారా ఉద్యోగి నిజమైనదేనా అనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించగలుగుతారు. భవిష్యత్‌లో పీఎఫ్ ఖాతాలకు మరింత భద్రత కల్పించేందుకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది.
Also Read : WhatsApp Block Sensational : 98 లక్షల ఖాతాలపై కొరడా జులిపించిన వాట్సాప్ సంస్థ


















