న్యూఢిల్లీ : 9వ తరగతి పాఠ్య పుస్తకంలో ‘అత్యవసర పరిస్థితి అంశాన్ని చేర్చాలని ఎన్సీఆర్టీ సిద్దమైంది. ఇందుకు భారతీయ జనతా పార్టీ మద్దతు పలికింది. ఇప్పుడు ఇది జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. 1975లో అత్యవసర పరిస్థితిని విధించినందుకు కాంగ్రెస్‌ను అధికార పార్టీ విమర్శించింది .ఈ అంశాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చాలన్న విద్యాసంస్థ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించింది. ఇదిలా ఉండగా భారతదేశ రాజ్యాంగ చరిత్రలోని ఆ “చీకటి అధ్యాయం” మళ్లీ పునరావృతం కాకుండా చూసేందుకు దానిని గుర్తుంచు కోవాల్సిన అవసరం ఉందని పేర్కొంంది. కాగా 9వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో అత్యవసర పరిస్థితి కాలానికి సంబంధించిన అంశాన్ని చేర్చాలన్న ఎన్సీఆర్టీ తీసుకున్న నిర్ణయం బాగుందని కితాబు ఇచ్చింది బీజేపీ.
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించింది. మొదటిసారిగా “అండర్‌స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్” అనే కొత్త సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో అత్యవసర పరిస్థితిపై ఒక విభాగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఎదురైనప్రధాన సవాళ్లలో ఒకటిగా అత్యధిక ప్రాథమిక హక్కులను నిలిపి వేసిన కాలంగా అత్యవసర పరిస్థితిని వివరిస్తుంది. ఈ అంశం కొత్త సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకంలో చేర్చబడింది. బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రకారం, 1975 జూన్ 25 భారతదేశ ప్రజాస్వామ్య , రాజ్యాంగ ప్రయాణంలో అత్యంత చీకటి అధ్యాయం . ఆ కాలంలో కాంగ్రెస్ ప్రతి రాజ్యాంగ సంస్థపై దాడి చేసిందని ఆయన ఆరోపించారు.
















