Donald Trump Interesting Comments : ఉక్రెయిన్ పై యుద్దానికి తాత్కాలిక విర‌మ‌ణ

త‌న చ‌ర్చ‌లు ఫ‌లించాయ‌న్న డొనాల్డ్ ట్రంప్

Hello Telugu - Donald Trump Interesting Comments

Hello Telugu - Donald Trump Interesting Comments

Donald Trump : అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు. అలాస్కాలోని యాంకరేజ్‌లో ఉక్రెయిన్‌పై మూడు గంటల పాటు జరిగిన చర్చల తర్వాత కాల్పుల విర‌మ‌ణ‌కు ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ అంగీకరించాడ‌ని తెలిపాడు. ఇది త‌న వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నాడు ప్రెసిడెంట్. ఇప్ప‌టికే తాను వ‌చ్చాక ప్ర‌పంచ వ్యాప్తంగా ఆరు యుద్దాలు జ‌ర‌గ‌కుండా ఆపాన‌ని చెప్పాడు. ఇందులో భార‌త్, పాకిస్తాన్ దేశాలు కూడా ఉన్నాయ‌ని అన్నాడు. తాను పుతిన్ తో జ‌రిపిన చ‌ర్చ‌లు ఫ‌లించాయ‌ని అన్నాడు. త‌న‌కు సంతోషంగా ఉంద‌న్నాడు. ఎంత కాలం ఇలా యుద్దం చేస్తారంటూ ప్ర‌శ్నించారు ట్రంప్.

Donald Trump Key Comments on Russia-Ukraine War

తామ కలిసి కుదుర్చుకున్న ఒప్పందం (పరిష్కారం కనుగొనడం) ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో మాకు సహాయపడుతుందని, ఉక్రెయిన్‌లో శాంతి వైపు మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్న‌ట్లు తెలిపాడు అమెరికా ప్రెసిడెంట్. చాలా అంశాలు చ‌ర్చ‌కు వచ్చినా ప్ర‌ధానంగా ఉక్రెయిన్ పై నిరాటంకంగా కొన‌సాగుతున్న యుద్దం గురించే ఎక్కువ స‌మ‌యం చ‌ర్చించిన‌ట్లు తెలిపారు ట్రంప్ (Donald Trump). రష్యా చమురు కొనుగోలు కోసం ట్రంప్ బెదిరించిన 25 శాతం శిక్షాత్మక సుంకాన్ని రద్దు చేయగలగడంతో భారతదేశానికి మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా శిఖరాగ్ర సమావేశానికి వెళుతున్నప్పుడు, ట్రంప్ ఉక్రెయిన్ తరపున చర్చలు జరపబోనని, ఒప్పందం కుదుర్చు కోవడం జెలెన్స్కీ బాధ్యత అని స్ప‌ష్టం చేశారు. ఘర్షణ నుండి సంభాషణకు వెళ్లడానికి మనం పరిస్థితిని సవరించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు పుతిన్.

Also Read : Minister Nara Lokesh Warning : మ‌హిళ‌ల జోలికి వ‌స్తే ఊరుకోను – లోకేష్

Exit mobile version