Donald Trump Interesting Comments : భార‌త దేశం అమెరికా మ‌ధ్య విడ‌దీయ‌ని బంధం

మాట మార్చిన అమెరికా దేశాధ్య‌క్షుడు ట్రంప్

Hello Telugu - Donald Trump Interesting Comments

Hello Telugu - Donald Trump Interesting Comments

Donald Trump : అమెరికా : సుంకాల విధింపుతో ఆయా దేశాల‌ను బెంబేలెత్తిస్తూ వస్తున్న అమెరికా దేశ అధ్య‌క్షుడు ట్రంప్ ఉన్న‌ట్టుండి మాట మార్చారు. ఇప్ప‌టికే ఇండియాపై గ‌త కొంత కాలంగా అక్క‌సు వెళ్ల‌గక్కుతూ వ‌చ్చారు . 50 శాతానికి పైగా సుంకాలు విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలో ఎక్క‌డా త‌ల వంచే ప్ర‌స‌క్తి లేద‌ని ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేశారు. ఇదే క్ర‌మంలో ఆయ‌న రెండు రోజుల పాటు జ‌పాన్ లో ప‌ర్య‌టించారు. అక్క‌డి నుంచి షాంఘై శిఖ‌రాగ్ర సద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఇందులో ర‌ష్యా, చైనా , తదిత‌ర దేశాధినేత‌ల‌తో భేటీ అయ్యారు. అక్క‌డి నుంచి నేరుగా ఇండియాకు విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా సుంకాల దెబ్బ‌కు ఇండియా త‌న కాళ్ల బేరానికి వ‌స్తుంద‌ని భావించిన ట్రంప్ (Donald Trump) కు కోలుకోలేని షాక్ ఇచ్చారు మోదీ.

Donald Trump Interesting Comments

షాంఘై స‌ద‌స్సులో చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ , ర‌ష్యా దేశాధినేత పుతిన్ తో మోదీ భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఉన్న‌ట్టుండి త‌న‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని భావించిన మోదీ దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. భారతదేశం-అమెరికా మధ్య ప్రత్యేక సంబంధం ఉందన్నారు. భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నారా అనే ప్రశ్నకు అధ్యక్షుడు సమాధానమిచ్చారు . సుంకాలు , రష్యన్ చమురు కొనుగోలుపై వాషింగ్టన్ , ఢిల్లీ మధ్య ప్రస్తుత ఉద్రిక్తతల మధ్య కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారతదేశం, అమెరికా మధ్య ప్రత్యేక సంబంధం ఉందని, రెండు దేశాలు సందర్భోచితంగా క్షణాలు మాత్రమే కలిగి ఉంటాయని, కాబట్టి ఆందోళన చెందడానికి ఏమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

Also Read : Yamuna River in Danger Zone : య‌మునా న‌ది ఉగ్ర‌రూపం ఢిల్లీ అత‌లాకుత‌లం

Exit mobile version