Yamuna River : ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ తల్లడిల్లుతోంది. భారీ ఎత్తున వరద ఉధృతి కొనసాగుతుండడంతో యమునా నది ఉగ్ర రూపం దాల్చుతోంది. నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. నిన్న 204.5 మీటర్లు ఉండగా ప్రస్తుతం ఇవాళ దానిని దాటేసింది. 405.33 మీటర్లకు చేరుకోవడంతో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. న్యూఢిల్లీ లోని వాసుదేవ్ ఘాట్ ను ముంచెత్తుతోంది. ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నానా తంటాలు పడుతున్నారు.
Yamuna River in Danger Zone
శనివారం ఉదయం యమునా నది (Yamuna River) ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నది నిండి పోయింది. భారీ ఎత్తున ప్రవహిస్తోంది. ఈ సందర్బంగా వరద ప్రభావిత ప్రాంతాలను ఢిల్లీ మంత్రి పర్వేశ్ వర్మ సందర్శించారు. అనవసర భయాందోళనకు గురి కావద్దన్నారు . అయితే దేశ రాజధాని యమునా నదిలో మునిగి పోయినట్లుగా మొత్తం పరిస్థితిని చిత్రీకరించడం సరికాదని అన్నారు. ఇప్పటికే తమ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. బాధితులకు భరోసా కల్పించడం జరుగుతోందన్నారు.
సివిల్ లైన్స్ ప్రాంతంలో ఒక్క చుక్క నీరు కూడా లేదు. రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డు రోడ్డు స్థాయి కంటే 8 నుండి 10 అడుగుల దిగువన ఉందన్నారు. వర్షపు నీటిని బయటకు పంపుతున్నారని తెలిపారు. ఢిల్లీ యమునా నదిలో మునిగి పోయిందని చెప్పడం సరికాదన్నారు. నిగమ్ బోధ్ ఘాట్‌ను కూడా సందర్శించి అక్కడి పరిస్థితిని అంచనా వేస్తానని మంత్రి పేర్కొన్నారు. కాగా యమునా నది నీటి మట్టాలు పెరగడంతో ఢిల్లీలోని మొనాస్టరీ మార్కెట్, యమునా బజార్, వాసుదేవ్ ఘాట్ సమీపంలోని నివాస ప్రాంతాలు మునిగి పోయాయి.
Also Read : Vinayak Immersion Sensational : మహా నిమజ్జనోత్సవానికి తరలిన గణనాథులు
