Delhi Capitals Strong Focus on Samson : సంజూ శాంస‌న్ పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఫోక‌స్

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ను వీడ‌నున్న క్రికెట‌ర్

Hello Telugu - Delhi Capitals Strong Focus on Samson

Hello Telugu - Delhi Capitals Strong Focus on Samson

Delhi Capitals : కేర‌ళ : ఐపీఎల్ వేలం పాట 2026కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. ప్ర‌ధానంగా స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. త‌ను రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ర‌పున ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. త‌ను ఆడుతూ , జ‌ట్టును న‌డిపిస్తూ జ‌ట్టుకు ఓ బ్రాండ్ ను తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేశాడు. శాంస‌న్ ను చేజిక్కించు కునేందుకు ప‌లు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ప్ర‌ధానంగా చెన్నై సూప‌ర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals), కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఉన్న‌ట్టు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా త‌న‌ను మినీ వేలంలో పాల్గొనేందుకు అనుమ‌తించాల‌ని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యాజ‌మాన్యాన్ని ఇప్ప‌టికే సంజూ శాంస‌న్ కోరాడు. దీంతో త‌ను ఐపీఎల్ వేలం పాట‌లోకి రావ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింది. గ‌తంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌న‌ను భారీ ధ‌ర‌కు తీసుకున్నా, ఈసారి జ‌రిగిన ఐపీఎల్ లో త‌న‌ను కావాల‌ని ప‌క్క‌న పెట్టే ప్ర‌య‌త్నం చేసింది. దీంతో విసిగి పోయిన శాంస‌న్ జ‌ట్టు నుంచి వైదొల‌గ‌డ‌మే మేల‌ని భావించాడు.

Delhi Capitals Focus on Sanju Samson

కాగా రాజ‌స్థాన్ రాయ‌ల్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ సంజూ శాంస‌న్ ను స్ట‌బ్స్ కూడిన ట్రేడ్ డీల్ ను ఖ‌రారు చేసిన‌ట్లు క్రీడా వ‌ర్గాల‌లో టాక్. అయితే డీసీ కీల‌క ఆట‌గాళ్ల‌ను ట్రేడ్ చేసేందుకు ఇష్ట ప‌డ‌టం లేదు. కానీ సంజూ శాంస‌న్ ను చేజిక్కించు కునేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాయి. ఇక శాంస‌న్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు త‌రపున 11 సీజ‌న్ల‌లో ఆడాడు. జోస్ బ‌ట్ల‌ర్ ను విడుద‌ల చేయ‌డం ప‌ట్ల త‌ను తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం, ఇందుకు మేనేజ్మ‌మెంట్ ఒప్పుకోక పోవ‌డంతో జ‌ట్టు నుంచి విడి పోయాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చేశాడు. మ‌రో వైపు చెన్నై సూప‌ర్ కింగ్స్ నుంచి ర‌వీంద్ర జ‌డేజా లేదా రుతురాజ్ ను ఇవ్వాల‌ని రాజ‌స్థాన్ కోరింద‌ని కానీ అందుకు ఆ జ‌ట్టు యాజ‌మాన్యం ఒప్పుకోలేద‌ని టాక్.

Also Read : Speaker Gaddam Prasad Strong Request : మ‌రో 8 వారాల గ‌డువు ఇవ్వండి : స్పీక‌ర్

Exit mobile version