Speaker Gaddam Prasad Strong Request : మ‌రో 8 వారాల గ‌డువు ఇవ్వండి : స్పీక‌ర్

ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై సుప్రీంకోర్టుకు

Hello Telugu - Speaker Gaddam Prasad Strong Request

Hello Telugu - Speaker Gaddam Prasad Strong Request

Speaker Gaddam Prasad : హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది పార్టీ ఫిరాయింపున‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేల‌పై ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నే దానిపై. ఇప్ప‌టి వ‌ర‌కు కుంటి సాకులు చెబుతూ కాల‌యాప‌న చేస్తూ వ‌చ్చారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. చ‌ట్టంలో ఉన్న లొసుగుల‌ను ఆస‌రాగా చేసుకుని బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ప్ర‌జా ప్ర‌తినిధులు ఇలా గోడ దూక‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ నుంచి బీ ఫామ్ తీసుకుని, కండువాలు క‌ప్పుకుని, ప్ర‌చారం చేసి, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వారంతా శాస‌న స‌భ సాక్షిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. కానీ రూల్స్ ను అతిక్ర‌మించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరారు.

Speaker Gaddam Prasad Request Supreme Court

దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఇదే అంశంపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు సీరియ‌స్ అయ్యింది. కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 90 రోజుల్లో తేల్చాల‌ని స్ప‌ష్టం చేసింది. ఎవ‌రైనా విచార‌ణ‌కు హాజ‌రు కాక పోయిన దానిని సీరియ‌స్ గా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని డిస్ క్వాలిఫై చేయాల‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేల‌కు నోటీసులు ఇచ్చినా ఇప్ప‌టి వ‌ర‌కు స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ (Speaker Gaddam Prasad) కేవ‌లం న‌లుగురు ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే విచారించింది. స్పీక‌ర్ ట్రిబ్యున‌ల్ లాగా విచారించాల‌ని, త్వ‌ర‌గా ఈ అంశంపై తేల్చాల‌ని ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా స్పీక‌ర్ ఊహించ‌ని విధంగా సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌కు మ‌రో 8 వారాల గ‌డువు ఇవ్వాల‌ని కోరారు. దీనిపై ఇంకా స్పందించ లేదు స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం.

Also Read : Jagadish Reddy Fired on Congress Govt : గాడి త‌ప్పిన కాంగ్రెస్ పాల‌న : జ‌గదీష్ రెడ్డి

Exit mobile version