BJP Approved Deepak Reddy : జూబ్లీహిల్స్ బై పోల్ లో బీజేపీ అభ్య‌ర్థిగా దీప‌క్ రెడ్డి

తాజాగా ప్ర‌క‌టించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ హైకమాండ్

Hello Telugu - BJP Approved Deepak Reddy

Hello Telugu - BJP Approved Deepak Reddy

Deepak Reddy : హైద‌రాబాద్ : ఎట్ట‌కేల‌కు బీజేపీ హైక‌మాండ్ ఆల‌స్యంగా మేలుకొంది. ఇప్ప‌టికే బీహార్ శాస‌న స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి తొలి జాబితాను ప్ర‌క‌టించింది. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థిని ఖ‌రారు చేసింది. ఈమేర‌కు బుధవారం అధికారికంగా ఎల్. దీప‌క్ రెడ్డిని (Deepak Reddy) బ‌రిలో ఉంచుతున్న‌ట్లు తెలిపింది. గ‌త కొంత కాలం నుంచీ ఆయ‌న బీజేపీలో సేవ‌లు అందిస్తూ వ‌స్తున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో చిర ప‌రిచితుడు కూడా. ఈ ఎల్ . దీప‌క్ రెడ్డి గతంలో 2023 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. త‌ను 25,866 ఓట్లను సాధించారు, మొత్తం పోలైన ఓట్లలో 14.11 శాతం ఓట్లు కైవ‌సం చేసుకున్నారు.

BJP Jublee Hills Bypoll Candidate Deepak Reddy

ఆయ‌న పూర్తి పేరు లంకాల దీప‌క్ రెడ్డి. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నిక‌ల్లో ముందుగా త‌మ అభ్య‌ర్థిని ఖ‌రారు చేసింది భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ. త‌మ పార్టీ త‌ర‌పున దివంగ‌త ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య మాగంటి సునీతను ఖ‌రారు చేసింది. కేసీఆర్ బి ఫామ్ కూడా ఇచ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ముందంజ‌లో ఉన్నారు. త‌న‌కు ప్ర‌చార ఖ‌ర్చు కోసం రూ. 40 ల‌క్ష‌ల చెక్కును కూడా అంద‌జేశారు. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్రిమిన‌ల్ కేసులు క‌లిగిన‌ నవీన్ యాదవ్‌ను నిలబెట్టింది. ఇదిలా ఉండ‌గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది, లెక్కింపు, ఫలితాల ప్రకటన 14న జరగనుంది. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని ప్రారంభించాయి.

Also Read : Balakrishna – Bala Sarawati Devi Death : బాల స‌ర‌స్వ‌తి దేవి మృతి ప‌ట్ల బాల‌య్య దిగ్భ్రాంతి

Exit mobile version