Balakrishna – Bala Sarawati Devi Death : బాల స‌ర‌స్వ‌తి దేవి మృతి ప‌ట్ల బాల‌య్య దిగ్భ్రాంతి

ఆమె మ‌ర‌ణం తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు లోటు

Hello Telugu - Balakrishna - Bala Sarawati Devi Death

Hello Telugu - Balakrishna - Bala Sarawati Devi Death

Balakrishna : హైద‌రాబాద్ : ప్రముఖ తెలుగు సినిమా గాయకురాలు, నటి రావు బాలసరస్వతి దేవీ (97) అకాల మరణం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌ (Balakrishna). త‌న మృతి త‌న‌ను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బాల సరస్వతి దేవీ చిన్ననాటి నుండే కళారంగంలో ప్రవేశించి 1930ల నుండి 1960ల వరకు తెలుగు, తమిళ సినిమాల్లో గాయనిగా , నటిగా మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. తమిళ సినిమాల్లో భక్త కుచేల, బాలయోగిని, తుకారాం వంటి చిత్రాల్లో చిన్నప్పుడే నటించారని త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డార‌ని ప్ర‌శంసించారు.

Balakrishna Shocking

తెలుగు సినిమాల్లో మొదటి ప్లేబ్యాక్ సింగర్‌గా భాగ్యలక్ష్మి చిత్రంలో “థిన్నే మీద సిన్నోడ” పాటకు స్వరం ఇచ్చి చరిత్ర సృష్టించారని కొనియాడారు నందమూరి బాల‌కృష్ణ‌. తెలుగులో షావుకారు, పిచ్చి పుల్లయ్య వంటి ఎన్నో చిత్రాలకు పాటలు పాడి తెలుగు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారని తెలిపారు. ఆల్ ఇండియా రేడియోలో మొదటి ‘లైట్ మ్యూజిక్’ గాయకురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారని వెల్ల‌డించారు. 2 వేలకుపైగా పాటలు పాడి తెలుగు సినీ చరిత్రలో అజ‌రామ‌రంగా నిలిచి పోయార‌న్నారు. బాలసరస్వతీదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్న‌ట్లు తెలిపారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాన‌ని అన్నారు.

Also Read : Bala Saraswati Devi Death : న‌టి, గాయ‌ని బాల స‌ర‌స్వ‌తి దేవి క‌న్నుమూత‌

Exit mobile version