TG EC : హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల న్నికల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు కేవలం గ్రామాలలో కేవలం సర్పంచ్ ఎన్నికలను నిర్వహించేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా కీలక సమావేశం నిర్వహంచింది. ఇందుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం (TG EC). స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జీవో(46) విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం .సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు 50% మించకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోలో పేర్కొంది.
TG EC Key Update
వార్డు మెంబర్లకు 2024 కుల సర్వే ఆధారంగా, సర్పంచులకు 2011 సెన్సస్ ఆధారంగా( బీసీ సర్పంచ్ అభ్యర్థులకు 2024 కుల సర్వే) రిజర్వేషన్లు కల్పిస్తూ పేర్కొంది. రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘం ఈ నెల 26న సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వచ్చే నెల డిసెంబర్ 11,14,17వ తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణకు అధికారుల సన్నాహాలు చేపట్టారు. పాత రిజర్వేషన్‌లతోనే సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం రోజున గ్రామాల వారీగా రిజర్వేషన్ల రోస్టర్ విడుదలకు రంగం సిద్ధం చేసింది ఈసీ.
Also Read : Aditya Thackeray Shocking Comments on BJP : బీజేపీ గెలుపు కోసం ఎన్నికల సంఘం
