VP CP Radhakrishnan Success : ఉప రాష్ట్ర‌ప‌తిగా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం

హాజ‌రైన ప్ర‌ధానమంత్రి, కేంద్ర మంత్రులు

Hello Telugu - VP CP Radhakrishnan Success

Hello Telugu - VP CP Radhakrishnan Success

CP Radhakrishnan : ఢిల్లీ : భార‌త దేశ నూత‌న ఉప రాష్ట్ర‌ప‌తిగా శుక్ర‌వారం ప్ర‌మాణ స్వీకారం చేశారు సీపీ రాధాకృష్ణ‌న్. మొన్న జ‌రిగిన ఎన్నిక‌లో త‌న స‌మీప అభ్య‌ర్థి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డిపై భారీ తేడాతో గెలుపొందారు. రాధాకృష్ణ‌న్ ఎన్డీయే త‌ర‌పున బ‌రిలో ఉన్నారు. అంత‌కు ముందు ఆయ‌న మ‌హారాష్ట్ర రాష్ట్రానికి 24వ గ‌వ‌ర్న‌ర్ గా ఉన్నారు. ఉప రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన వెంట‌నే త‌న గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇదిలా ఉండ‌గా ఇవాళ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌నంలో జ‌రిగిన కార్య‌క్రమంలో నూత‌నంగా ఎన్నికైన రాధాకృష్ణ‌న్ (CP Radhakrishnan) తో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

CP Radhakrishnan As a Vice President

ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ చంద్ర షా, రాజ్ నాథ్ సింగ్ , జేపీ న‌డ్డా, కిర‌ణ్ రిజిజు, జ‌యంత్ చౌద‌రితో పాటు ఆయా రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు, ఎంపీలు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. ఇదిలా ఉండ‌గా మ‌హారాష్ట్ర ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించ‌డంతో త‌న స్థానంలో ఇంఛార్జ్ గ‌వ‌ర్నర్ గా గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ‌వ్ర‌త్ కు రాష్ట్ర‌ప‌తి ముర్ము అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈమేర‌కు శుక్ర‌వారం కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది రాష్ట్ర‌ప‌తి భ‌వ‌నం. ఇక సీపీ రాధాకృష్ణ‌న్ స్వ‌స్థ‌లం త‌మిళ‌నాడు. ఆయ‌న మే 4, 1957లో తిరుప్పూర్ లో పుట్టారు. 1998లో కోయంబ‌త్తూర్ నుండి తొలిసారి లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. 1999లో తిరిగి ఎంపీగా గెలుపొందారు.

Also Read : Nitin Gadkari Shocking Comments : కావాల‌ని బ‌ద్నాం చేస్తున్నారు : గ‌డ్క‌రీ

Exit mobile version