CM Revanth Reddy Fired on BRS : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై బీఆర్ఎస్ కు చిత్త‌శుద్ది లేదు

శాస‌న స‌భ‌లో నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి

Hello Telugu - CM Revanth Reddy Fired on BRS

Hello Telugu - CM Revanth Reddy Fired on BRS

CM Revanth Reddy : హైద‌రాబాద్ – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఆదివారం జ‌రిగిన శాస‌న స‌భ లో . బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై ఆ పార్టీకి , అధినేత కేసీఆర్ కు చిత్త‌శుద్ది లేద‌న్నారు. కానీ తాము వ‌చ్చాక‌నే బీసీల‌కు పెద్ద ఎత్తున న్యాయం చేయాల‌ని సంక‌ల్పించామ‌న్నారు. కానీ కేంద్రం మోకాలు అడ్డుతోంద‌ని ఆవేద‌న చెందారు. ఇప్ప‌టికే చ‌ట్టం తీసుకు రావాల‌ని డిమాండ్ చేశామ‌ని, ఆ మేర‌కు ఢిల్లీ వేదిక‌గా ధ‌ర్నా కూడా చేశామ‌న్నారు. చివ‌ర‌కు బిల్లు రూపొందించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని, అందుకే త్వ‌ర‌లో జ‌రిగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బీసీల‌కు పార్టీ ప‌రంగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగిందన్నారు. విచిత్రం బీసీల జ‌పం చేస్తున్న బీఆర్ఎస్ కు వారి గురించి మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు.

CM Revanth Reddy Slams BRS Party

తాము 42 శాతం రిజ‌ర్వేష‌న్ ఇస్తూ తీర్మానం చేయ‌డం జ‌రిగింద‌ని, ఇందుకు సంబంధించి బిల్లును కూడా గ‌వ‌ర్న‌ర్ కు పంపించామ‌ని చెప్పారు. అయితే ఈ బిల్లును ప‌రిశీల‌న నిమిత్తం రాష్ట్ర‌ప‌తి ప‌రిశీల‌న కోసం గ‌వ‌ర్న‌ర్ పంపించార‌ని తెలిపారు. మోదీ నిజ‌మైన బీసీ నాయ‌కుడే అయితే త‌క్ష‌ణ‌మే ఈ బిల్లుకు ఆమోదం తెల‌పాల‌ని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుత ప్రభుత్వం గతంలో అసెంబ్లీలో రెండు బిల్లులను ఆమోదించిందని ఒకటి విద్య , ఉపాధిలో 42 శాతం రిజర్వేషన్లు, మరొకటి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు హామీ ఇస్తూ గవర్నర్ ఆమోదం కోసం పంపిందని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లులు దాదాపు ఐదు నెలలుగా రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి అని సీఎం అన్నారు.

Also Read : PM Modi Interesting Comments : జెలెన్ స్కీ డోంట్ వ‌ర్రీ : ప్ర‌ధాని మోదీ

Exit mobile version