PM Modi Interesting Comments : జెలెన్ స్కీ డోంట్ వ‌ర్రీ : ప్ర‌ధాని మోదీ

శాంతి పున‌రుద్ద‌ర‌ణ‌కు సిద్దంగా ఉన్నాం

Hello Telugu - PM Modi

Hello Telugu - PM Modi

PM Modi : ఢిల్లీ – ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ బిజీగా ఉన్నారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ఆదివారం కీల‌క‌మైన , అత్యంత శ‌క్తివంత‌మైన దేశ‌మైన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. ఇదే క్ర‌మంలో అంత‌కు ముందు జ‌పాన్ లో ప‌ర్య‌టించారు. ఆయ‌న‌కు గ్రాండ్ వెల్ క‌మ్ ల‌భించింది. మ‌రో వైపు ఉన్న‌ట్టుండి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ న‌రేంద్ర మోదీకి (PM Modi) ఫోన్ చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌ష్యాతో జ‌రుగుతున్న అంత‌ర్యుద్దాన్ని నివారించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని జెలెన్ స్కీ కోరారు. ప్రెసెడింట్ కు పూర్తి భ‌రోసా ఇచ్చారు. శాంతి పున‌రుద్ద‌ర‌ణ కోసం త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని చెప్పారు.

PM Modi Interesting Comments on Ukraine

ప్ర‌స్తుతం ర‌ష్యా గుర్రుగా ఉంది జెలెన్ స్కీపై. అమెరికా, యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి ఉక్రెయిన్ కు. దీంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ర‌ష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్. ప్ర‌స్తుతం పుతిన్ తో స‌త్ సంబంధాలు క‌లిగిన ఏకైక నాయ‌కుడు కేవ‌లం ఒకే ఒక్క‌డు ప్ర‌ధాన‌మంత్రి మోదీ మాత్ర‌మే. అందుకే ట్రంప్ సైతం చేసిన ప్ర‌య‌త్నాల‌కు సైతం గండి ప‌డింది. త‌న‌ను ఏమాత్రం న‌మ్మ‌డం లేదు పుతిన్. ఇదే క్ర‌మంలో పుతిన్ వినిపించుకునే స్థితిలో లేడు. ముందుగా అమెరికా, దాని మిత్ర‌ప‌క్ష దేశాలు ఆయుధాల స‌ర‌ఫరాను నిలిపి వేయాలని లేక పోతే ఉక్రెయిన్ కు చుక్క‌లు చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ త‌రుణంలో జెలెన్ స్కీకి ముందున్న ఏకైక మార్గం ఒక్క‌టే ఉంది. అది మోదీని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం. ట్రంప్ ను సైతం ప‌క్క‌న పెట్టేశాడు పుతిన్. ఈ త‌రుణంలో మోదీ నుంచి స్ప‌ష్ట‌మైన హామీ దొర‌క‌డం విశేషం.

Also Read : PM Modi Interesting Meet : చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ తో మోదీ భేటీ

Exit mobile version