CM Revanth Reddy Strong Instructions : జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డికి అంతా మ‌ద్ద‌తు ఇవ్వాలి

ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎంపీల‌కు పిలుపు

Hello Telugu - CM Revanth Reddy Strong Instructions

Hello Telugu - CM Revanth Reddy Strong Instructions

CM Revanth Reddy : హైద‌రాబాద్ – ఎజెండా, జెండా లేకుండా ఇండియా కూట‌మి బ‌ల‌ప‌ర్చిన ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డికి అంతా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరార ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy). సోమ‌వారం హైద‌రాబ్ కు విచ్చేశారు జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి . ఈ సంద‌ర్బంగా జ‌రిగిన‌ ప‌రిచ‌య కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇండియా కూట‌మి ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా సుద‌ర్శ‌న్ రెడ్డిని అభినందించ‌డానికి ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. అంద‌రూ ఒక తాటిపైకి వ‌చ్చి తెలుగు వారంద‌రూ సుద‌ర్శ‌న్ రెడ్డి కి అండ‌గా నిల‌బ‌డాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

CM Revanth Reddy Instructions to Congress MP’s

నీలం సంజీవ‌రెడ్డి , వివిగిరి, పీవీ న‌ర‌సింహ‌రావు, జైపాల్ రెడ్డి ,వెంక‌య్య నాయుడు, ఎన్టీ రామారావు వంటి తెలుగు నేత‌లు గతంలో జాతీయ స్థాయిలో కీల‌క పాత్ర పోషించారని చెప్పారు. ఈనాడు తెలుగు నాయ‌కులు జాతీయ రాజ‌కీయాల్లో అంత కీల‌కంగా లేరని వాపోయారు. ఇండియా కూట‌మి ఆలోచ‌న‌ను జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి గౌర‌వించార‌ని, అందుకే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగారన్నారు సీఎం. సుద‌ర్శ‌న్ రెడ్డి పోటీ వ‌ల్ల ఎన్డీఎ కూట‌మికి ఇండియా కూట‌మి గ‌ట్టి పోటీ ఇస్తోందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాల‌ని, రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేయాల‌ని ఎన్డీఎ కూట‌మి ప్ర‌య‌త్నం చేస్తుంటే, రాజ్యాంగాన్ని కాపాడాలని , రిజ‌ర్వేష‌న్ల‌ను కాపాడు కోవాల‌ని, ప్ర‌జాస్వామ్యాన్ని ర‌క్షించు కోవాల‌ని ఇండియా కూట‌మి ఎన్నిక‌ల్లో దగింద‌న్నారు.

ఉప రాష్ట్ర‌ప‌తి రాజీనామా చేయ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. ఆయ‌న రాజీనామాను దేశ ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారని అన్నారు. తెలుగు వ్య‌క్తికి జాతీయ స్థాయిలో అవ‌కాశం వ‌చ్చిందన్నారు. తెలుగు వారి గౌర‌వం పెరిగేలా .. అంద‌రూ ఒక తాటిపైకి వ‌చ్చి సుద‌ర్శ‌న్ రెడ్డి కి అండ‌గా నిలబడాల‌న్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల అధ్య‌క్షులు చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్, వైఎస్ జ‌గ‌న్ , చంద్ర‌శేఖర్ రావు, ఓవైసీ తో పాటు రెండు రాష్ట్రాల‌కు చెందిన‌ 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్య‌స‌భ సభ్యుల‌కు ఆత్మ ప్ర‌భోదానుసారం ఓటు వేయాల‌ని వ్య‌క్తిగ‌తం గా విజ్ఝ‌ప్తి చేస్తున్నాన‌ని చెప్పారు రేవంత్ రెడ్డి.

Also Read : Minister Nimmala Interesting Comments : చంద్ర‌బాబు నాయుడు వ‌ల్ల‌నే ఏపీకి గుర్తింపు

Exit mobile version