China Lifts Sanctions Sensational : చైనా ఆంక్ష‌ల ఎత్తివేత వాణిజ్యం బార్లా

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న జిన్ పింగ్

Hello Telugu - China Lifts Sanctions Sensational

Hello Telugu - China Lifts Sanctions Sensational

China : చైనా : భార‌త దేశం పై సుంకాల పేరుతో ఇబ్బందుల‌కు గురి చేస్తూ వ‌చ్చిన అమెరికా దేశ అధ్య‌క్షుడు ట్రంప్ కు ఝ‌ల‌క్ ఇచ్చేలా చైనా (China) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ప్ర‌ధాన‌మంత్రి ఇటీవ‌ల జ‌రిపిన ప‌ర్య‌ట‌న మంచి స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది. ఇందులో భాగంగా గ‌త 7 సంవ‌త్స‌రాలుగా భార‌త్, చైనా దేశాల మ‌ధ్య సంబంధాలు తెగి పోయాయి. చ‌ర్చ‌ల ఫ‌లితంగా కీల‌క నిర్ణ‌యం తీసుకునేలా చేసింది జిన్ పింగ్ ను. ఈ మేర‌కు భార‌త్ తో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న బీజింగ్ ఆంక్ష‌ల‌ను ఎత్తి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. టియాంజిన్‌లో జరిగిన షాంఘై శిఖరాగ్ర సమావేశంలో ర‌ష్యా, ఇండియా, చైనా పాల్గొన్నాయి.

China lift Sanctions

ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అమెరికా ఆర్థిక బెదిరింపులు , సుంకాల మధ్య రెండు ఆసియా దిగ్గజాల మధ్య సంబంధాలను వ్యూహాత్మకంగా పునరుద్ధరించే ప్రతిపాదనగా భావిస్తున్న ఈ కార్యక్రమంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ వారం ప్రారంభంలో టియాంజిన్‌లో దాదాపు గంటసేపు జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలిశారు. చైనా కొన్ని ఎగుమతి ఆంక్షలను ఎత్తివేసిందని, దీనివల్ల భారతదేశానికి అరుదైన ఖనిజాలు, ఎరువులు, టన్నెల్-బోరింగ్ యంత్రాల సరఫరా తిరిగి ప్రారంభమైందని కేంద్రం ధృవీకరించింది.

ఇదిలా ఉండ‌గా గత నెలలో న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి కేంద్ర మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ తో భేటీ అయ్యారు. గ‌తంలో చైనాలో కొన్నేళ్ల పాటు రాయ‌బారిగా పని చేశారు. చైనా అన్ని విధాలుగా స‌హ‌కారం అందిస్తుంద‌ని హామీ ఇచ్చారు. కాగా చైనా ఆంక్ష‌ల వేత అమెరికా చీఫ్ ట్రంప్ కు కోలుకోలేని దెబ్బ అని చెప్ప‌క‌త‌ప్ప‌దు.

Also Read : Bigg Boss 9 Grand Launch : రేపే బిగ్ బాస్ 9 రియాల్టీ షో గ్రాండ్ లాంచ్

Exit mobile version