Bigg Boss 9 Grand Launch : రేపే బిగ్ బాస్ 9 రియాల్టీ షో గ్రాండ్ లాంచ్

బుల్లితెర‌పై సంచ‌ల‌నానికి సిద్ద‌మైన నాగ్

Hello Telugu - Bigg Boss 9 Grand Launch

Hello Telugu - Bigg Boss 9 Grand Launch

Bigg Boss 9 : తెలుగు బుల్లితెర‌పై వినోదాన్ని పంచేందుకు సిద్ద‌మైంది అక్కినేని నాగార్జున మ‌రోసారి హోస్ట్ గా నిర్వ‌హిస్తున్న బిగ్ బాస్ -9 (Bigg Boss 9) రియాల్టీ షో. ఇప్ప‌టికే దీని కోసం భారీ ఎత్తున ఎదురు చూస్తున్నారు. గ‌తంలో కొంద‌రు సెలిబ్రిటీలు హోస్ట్ చేసినా వ‌ర్క‌వుట్ కాలేదు. ఈసారి సీజ‌న్ లో సైతం నాగార్జున రాడ‌ని ఆయ‌న స్థానంలో విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌స్తాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కానీ మ‌రోసారి త‌నే ప్రోగ్రాం చేప‌డ‌తాడ‌ని ప్ర‌క‌టించారు నిర్వాహ‌కులు. దీంతో షో టెలికాస్ట్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది ప్ర‌సారం కావ‌డానికి ఇంకా కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే మిగిలింది. భారీ ఎత్తున ఓపెనింగ్ ఈవెంట్ ఉంటుంద‌ని టాక్.

Bigg Boss 9 Grand Launch Tomorrow

అన్ని హంగుల‌తో బిగ్ బాస్ తెలుగు తొమ్మిదవ సీజన్‌తో తిరిగి వచ్చేందుకు సిద్ద‌మైంది. హోస్ట్ నాగార్జున టెలివిజన్ స్క్రీన్‌లకు మరిన్ని డ్రామా, వినోదం, ఉత్కంఠను తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా ఈ సీజన్ అభిమానులు ఇంతకు ముందు చూసిన దానికంటే చాలా భిన్నంగా ఉంటుందని ప్ర‌క‌టించారు.
మొదటిసారిగా రియాలిటీ షోలో సినిమా, టీవీ ప్రముఖులు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పోటీదారులుగా పాల్గొంటుండ‌డం విశేషం. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ లాంచ్ కార్య‌క్ర‌మానికి సిద్ద‌మైంది. ఆదివారం రాత్రి 7 గంట‌ల‌కు జ‌ర‌గ‌నుంద‌ని నిర్వాహ‌కులు ప్ర‌క‌టించారు అధికారికంగా . జియో హాట్‌స్టార్ లో ఇది టెలికాస్ట్ కానుంది. 45 మంది పోటీదారుల‌లో అనేక రౌండ్ల త‌ర్వాత చివ‌ర‌కు ఆరుగురు మాత్ర‌మే ఎంపిక‌య్యారు. ఎంపికైన వారిలో దివ్య, ప్రసన్న, పవన్, శ్రేయ, అనుష, శ్వేత. ఈ పోటీదారులు బిగ్ బాస్ హౌస్‌లోకి తొలిసారిగా తెలుగు వెర్షన్‌లో సెలబ్రిటీలతో పాటు ప్రవేశిస్తారు.

Also Read : Ghaati OTT Sensational : ‘ఘాటి’ని చేజిక్కించుకున్న అమెజాన్ ప్రైమ్

Exit mobile version