Deputy CM Pawan Kalyan Proven : సుస్థిర పాలనతోనే సంక్షేమం సాధ్యం

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్

Hello Telugu - Deputy CM Pawan Kalyan Proven

Hello Telugu - Deputy CM Pawan Kalyan Proven

Pawan Kalyan : అమ‌రావ‌తి – సుస్థిర పాల‌న‌తోనే అభివృద్ది, సంక్షేమం సాధ్యం అవుతుంద‌న్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ (Pawan Kalyan). పెట్టుబడులు రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ.. సుస్థిర పాలన కూటమి ప్రభుత్వ బాధ్యత అన్నారు. గత ప్రభుత్వ చీకటి రోజులను స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నామ‌న్నారు. దేశంలో అంతర్గత సుస్థిరత దెబ్బ తీసేవారిపై ఓ కన్నేసి ఉంచాలని వార్నింగ్ ఇచ్చారు. విదేశీ శక్తుల అజెండాను మోస్తున్న వారిపట్ల అప్రమత్తత అవసరం అన్నారు. అంతర్గత శత్రవులను ఓ కంట కనిపెట్టాల‌ని అన్నారు. ప్రధాని మోదీ , సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తామ‌న్నారు. ఏడాది పాలనలో సూపర్ సిక్స్ అమలు చేశామ‌న్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్ర ప్రగతిని మరింత పరుగులు పెట్టిస్తామ‌ని చెప్పారు.#

Pawan Kalyan Key Comments

కాకినాడలో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జెండా ఎగుర వేసి ప్ర‌సంగించారు. కూటమి ప్రభుత్వానికి శాంతి భద్రతల నిర్వహణ మీద, దేశ సుస్థితర మీద సమగ్ర అవగాహన ఉంద‌న్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకటి రోజులు వస్తాయి. రాష్ట్రం కూడా 2019 నుంచి 2024 వరకు అలాంటి చీకటి రోజులను ఎదుర్కొందన్నారు. గత పాలకులు బ్రిటీషర్ల మాదిరి రాష్ట్రాన్ని తమ కబంధ హస్తాల్లో పెట్టుకుంటే.. స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తితో ఎదుర్కొన్నామని చెప్పారు. ఆగస్ట్ 15ని ప్రతి ఒక్కరు గుండెల్లోతుల నుంచి స్వీకరించాలి. దేశ విభజన సమయంలో లాహోర్ పాకిస్థాన్ లో అంతర్భాగం అవుతుందని ఎవ్వరికీ తెలియదు. సడెన్ గా లాహోర్ డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మత ప్రాతిపదిక‌న‌ అక్కడ ఉన్న హిందువులను పంపివేసిన సమయంలో ఎన్నో దారుణాలు జరిగాయన్నారు.

దేశ విభజన జరిగిన నాటి నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు మత ప్రాతిపదికన హింస జరుగుతూనే ఉందన్నారు. భారత దేశం తన లౌకిక విధానాన్ని ఎప్పుడూ మర్చి పోలేద‌న్నారు. దేశ విభజన జరిగిన తర్వాత మతానికి సంబంధం లేకుండా భారత దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించి లౌకిక వాదాన్ని ముందుకు తీసుకు వెళ్లిందన్నారు. . డాక్టర్ అబ్దుల్ కలాం లాంటి వారిని అత్యున్నత పదవిలో కూర్చో బెట్టిన ఘ‌న‌త మ‌న దేశానికి ఉంద‌న్నారు. కానీ ఆ పరిస్థితులు పాకిస్థాన్ దేశంలో లేవ‌న్నారు. అవినీతి ఉన్న చోట దేశం బలహీన పడుతుందన్నారు. అలాంటి పరిస్థితులు ఉండకూడదనే తాము ప్రయత్నం చేస్తున్నామ‌ని అన్నారు. ప్రజలు పహారా కాస్తేనే ప్రజాస్వామ్యం బలపడుతుంద‌ని చెప్పారు ప‌వన్ క‌ళ్యాణ్‌.

Also Read : KTR Interesting Comments KCR : కేసీఆర్ లాగా పాలించిన నేత దేశంలో లేరు

Exit mobile version