BRS Party Fired on Congress Govt : బీసీల‌ను మోసం చేసిన కాంగ్రెస్ స‌ర్కార్

నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు

Hello Telugu - BRS Party Fired on Congress Govt

Hello Telugu - BRS Party Fired on Congress Govt

BRS Party : హైద‌రాబాద్ : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స‌ర్కార్ కావాల‌ని బీసీల‌ను మోసం చేసింద‌ని ధ్వ‌జ‌మెత్తెంది బీఆర్ఎస్ పార్టీ (BRS Party). తెలంగాణ భ‌వ‌న్ లో మాజీ మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, వి. శ్రీ‌నివాస్ గౌడ్, ఎంపీ వ‌ద్దిరాజు ర‌విచంద్ర‌, ఎమ్మెల్సీ డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ బీఆర్ఎస్ విధానాన్ని స్పష్టంగా చెప్పామ‌న్నారు. జీఓ ద్వారా రిజ‌ర్వేష‌న్లు సాధ్యం కావ‌ని, ఇది కేవ‌లం రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని స్ప‌ష్టం చేశామ‌న్నారు. కానీ కాంగ్రెస్ స‌ర్కార్ కావాల‌ని రాజ‌కీయ ల‌బ్ది పొందేందుకే నాట‌కాలు ఆడింద‌న్నారు. తమిళనాడు వెళ్లి కూడా అధ్యయనం చేసి వచ్చి చెప్పామ‌న్నారు. బీసీలను అవమానం చేసేలా వ్యవహరించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జీఓ న్యాయస్థానంలో నిలబడదని సీఎం, మంత్రులు, అందరికీ తెలుసన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.

BRS Party Slams Congress Govt

బీహార్, మహారాష్ట్ర తప్పిదాలు చేయవద్దని కోరామ‌న్నారు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న రేవంత్ రెడ్డి జీఓ ఎందుకు ఇచ్చారంటూ ప్ర‌శ్నించారు. 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పిస్తామని జీఓ ఎందుకు ఇచ్చార‌ని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీసీలు ఏం చేస్తారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లని జీఓ ఇచ్చిందని ఆరోపించారు. 1992లో తమిళనాడు సీఎం జయలలిత ఎమ్మెల్యేలు, సిబ్బందిని ఢిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ల కోసం భీష్మించి కూర్చున్నార‌ని గుర్తు చేశారు. అప్పుడు కేంద్రం దిగివచ్చి రాజ్యాంగ సవరణ చేయడం వల్ల తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు పెరిగాయన్నారు. అందరం కలిసి ఢిల్లీకి వెళ‌దామ‌ని, దీనికి సీఎం సిద్ద‌మా అని స‌వాల్ విసిరారు.

Also Read : TG High Court-BC Association Sensational : హైకోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌

Exit mobile version