TG High Court-BC Association Sensational : హైకోర్టు తీర్పుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌

పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ సంఘం చీఫ్

Hello Telugu - TG High Court-BC Association Sensational

Hello Telugu - TG High Court-BC Association Sensational

TG High Court : హైద‌రాబాద్ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ను నిరసిస్తూ శుక్ర‌వారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాల‌ని పిలుపునిచ్చారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. బీసీ రిజర్వేషన్ల చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపి ఉంటే హైకోర్టులో (TG High Court) స్టే వచ్చేది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేరిస్తే న్యాయ పరమైన అవరోధాలు ఉండేవి కావ‌ని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలన్నీ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ నేపం నెట్టడమే తప్ప బీసీలకు నిజమైన మద్దతు ఇవ్వడం లేదని ఆరోపించారు.

TG High Court Stay for BC Reservation Bill

హైదరాబాదులో బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామ‌ని అన్నారు. హైకోర్టు తీర్పు పూర్తిగా ఏక‌పక్ష‌మ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. చట్టబద్ధంగా పెంచిన బీసీ రిజర్వేషన్ల జీవో పై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వడాన్ని బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా నిరసిస్తుందని స్ప‌ష్టం చేశారు. ఇది బీసీ వ్యతిరేక చర్యగా భావిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. కొన్నేళ్లుగా బీసీల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగా మాత్ర‌మే చూశార‌న్నారు.

. ఈ మీడియా సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, దాసు సురేష్, విక్రమ్ గౌడ్, కనకాల శ్యాం కురుమ, మనీ మంజరి,నరేష్ ప్రజాపతి, నరసింహ నాయక్, జాజుల లింగం, శేఖర్ సగర, గొడుగు మహేష్ యాదవ్ ఈడిగ శ్రీనివాస్ గౌడ్, మాదేశి రాజేందర్, కవుల జగన్నాథo పానుగంటి విజయ్, వరికుప్పల మధు, మల్లికార్జున యాదవ్, వెంకటేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : YS Jagan Challenge – Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అలుపెరుగ‌ని పోరాటం

Exit mobile version