Bigg Boss 19 : ముంబై – ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న అత్యంత జనాదర పొందిన పూర్తి వినోదాత్మకమైన , జనరంజకమైన రియాల్టీ షో బిగ్ బాస్ -19 (Bigg Boss 19) సీజన్ కు సంబంధించి నిర్వాహకులు ఉత్కంఠకు తెర దించారు. ఈ మేరకు ఇందులో పాల్గొంటున్న వారి పోటీదారుల జాబితాను ఖరారు చేసింది. అధికారికంగా ప్రకటించారు. ఈ షో నిర్వాహకులు గ్లోబల్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ అండర్ టేకర్ తో కూడా చర్చలు జరిపినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ 19 ప్రోగ్రాం ఆగస్టు 24న ప్రీమియర్ కానుంది.
Bigg Boss 19 Updates
ఈ సంవత్సరంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న షోలలో ఇది ఒకటిగా నిలిచింది. రియాలిటీ షోలోకి ఏ ప్రముఖులు ప్రవేశిస్తారో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూపులకు దీంతో తెర పడేలా చేసింది. ఇక నిర్వాహకులు ప్రకటించిన ప్రకారం ధృవీకరించబడిన పోటీదారులలో అవేజ్ దర్బార్, గౌరవ్ ఖన్నా, అష్నూర్ కౌర్, నగ్మా మిరాజ్కర్, బసీర్ అలీ, గేమర్ పాయల్ ధరే, జీషన్ క్వాద్రి , షెహబాజ్ బాదేశా ఉన్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ షో 19లో పాల్గొనేందుకు గ్లోబల్ బాక్సింగ లెజెండ్ మైక్ టైసన్ తో కూడా చర్చలు జరిపారని ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.
స్టార్ టీవీ ముందుగా బిగ్ బాస్ ను ప్రారంభించింది. మరో వైపు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం కూడా తనే స్టార్ట్ చేసింది. ఈ రెండు షోలు ఆ ఛానల్ కు కోట్లాది రూపాయలు సమకూర్చి పెట్టేలా చేసింది.
Also Read : Whistleblower Arrest Sensational : ధర్మస్థల హత్యల కేసులో విజిల్ బ్లోయర్ అరెస్ట్
