Whistleblower : కర్ణాటక – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధర్మస్థల హత్యల కేసుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తానే మృత దేహాలను పాతి పెట్టానని, దహనం చేశానని, మరికొన్నింటిని నదిలో పార వేశానంటూ బాంబు పేల్చాడు. ఇది చర్చకు దారి తీసింది. బ్లోయర్ చేసిన ఆరోపణలపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సిట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి దీనికి నేతృత్వం వహించారు. శుక్రవారం రాత్రి విచారణలో భాగంగా పలు ప్రశ్నలు సంధించారు. కానీ ఫలితం రాలేదని సమాచారం. ధర్మస్థల లోని స్పాట్ నెంబర్ 17లో ప్రత్యేక దర్యాప్తు బృందం చేసిన శోధన ఎటువంటి పురోగతి లేకుండా ముగిసింది.
Whistleblower Arrest
ధర్మస్థలలో జరిగిన రహస్య ఖననాలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు కేసులో విజిల్ బ్లోయర్‌ను (Whistleblower) అరెస్టు చేసింది. 1995, 2014 మధ్య ధర్మస్థలంలో పని చేసినట్లు చెప్పుకున్నాడు నిందితుడు. హత్య, లైంగిక వేధింపుల వంటి నేరాలకు గురైన వ్యక్తుల మృత దేహాలను బలవంతంగా పారవేయాల్సి వచ్చిందని పేర్కొంటూ జూలై 3న ఫిర్యాదు చేశాడు. జూలై 11న, అతను మేజిస్ట్రేట్ ముందు హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, తాను స్వయంగా ఖననం చేసినట్లు చెప్పిన అస్థిపంజర అవశేషాలను అప్పగించాడు.
అతను మొదట్లో అవశేషాలు ఒక మహిళకు చెందినవని పేర్కొన్నాడు. అయితే, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదిక తరువాత అవశేషాలు పురుషుడివని నిర్ధారించింది, దీంతో పరిశోధకులు అతనిపై అబద్ధం చెప్పినందుకు కేసు నమోదు చేశారు. విచారణ కోసం తీసుకెళ్లే ముందు తనకు సెక్యూరిటీ తొలగించారు. అబద్దపు సాక్ష్యం చెప్పారంటూ బ్లోయర్ ను ఇవాళ అధికారికంగా అరెస్ట్ చేసినట్లు ప్రకటించిది సిట్.
Also Read : India Economy Growth : భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఎస్బిఐ కీలక నివేదిక
