America Gives Huge Relief : అమెరికాలో చదువుకునే విద్యార్థులకు బిగ్ రిలీఫ్

హెచ్‌1బీకి మారితే లక్ష డాలర్ల ఫీజు కట్టక్కర్లేదు

Hello Telugu - America Gives Huge Relief

Hello Telugu - America Gives Huge Relief

America : న్యూయార్క్ : అమెరికా ఖుష్ క‌బ‌ర్ చెప్పంది. విదేశాల నుంచి నేరుగా హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికే లక్ష డాలర్ల (రూ.88 లక్షలు) ఫీజు వర్తిస్తుందని, అమెరికాలోనే (America) ఉండి వీసా స్టేటస్‌ను మార్చుకునే వారికి, ఇప్పటికే హెచ్‌1బీ ఉండి కొనసాగింపు కోరే వారికీ ఈ ఫీజు వర్తించదని అగ్ర రాజ్యం స్పష్టం చేసింది. విదేశాల నుంచి వలసేతర ఉద్యోగుల ప్రవేశాన్ని నియంత్రించేందుకు సెప్టెంబరు 19వ తేదీన అధ్యక్షుడు ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో కొన్ని మినహాయింపులు ఇస్తున్న‌ట్లు తెలిపారు. గతంలో జారీ చేసి ఇప్పటికీ వాలిడిటీ ఉన్న హెచ్‌1బీ వీసాల పొడిగింపునకు లక్ష డాలర్ల ఫీజు వర్తించదని స్ప‌ష్టం చేశారు. ఈ ఏడాది సెప్టెంబరు 21వ తేదీ తెల్లవారుజామున 12.01 గంటల వరకూ దరఖాస్తు చేసిఉన్న వారికీ ఇది వర్తించదని తెలిపింది స‌ర్కార్. అంతేకాదు హెచ్‌1బీ వీసా ఉన్నవారు అమెరికా లోపలా, బయటా ప్రయాణించినా ఎటువంటి ఫీజు వసూలు చేయబోమ‌ని స్ప‌ష్టం చేసింది.

America Gives Relief

విద్యార్థి వీసా ఎఫ్‌1 ఉన్నవారు, కంపెనీ తరఫున ఎల్‌-1 వీసా ఉన్నవారు, హెచ్‌1బీకి వీసా స్టేటస్‌ను మార్చుకుంటే లక్ష డాలర్లను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇక‌ దేశంలోనే ఉండి స్టేటస్‌ను మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో అమెరికాలో చదువుకుంటున్న, ఉంటున్న భారతీయులకు స్పష్టత వచ్చింది. ఇన్నాళ్లూ లక్ష డాలర్ల ఫీజు ఎవరు చెల్లించాలనే దానిపై కొంత సందిగ్ధం నెలకొంది. ఇక అమెరికా వెలుపల ఉండి హెచ్‌1బీకి దరఖాస్తు చేసుకునే వారికి లక్ష డాలర్ల ఫీజు వర్తిస్తుంది. సెప్టెంబరు 21 నాటికి తమ హెచ్‌1బీ వీసాల అమెండ్‌మెంట్‌కు, స్టేటస్‌ మార్పునకు, పొడిగింపునకు దరఖాస్తు చేసుకున్న అమెరికాలోనే ఉన్న విదేశీయులకు ఇది వర్తించదని కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

Also Read : CM Chandrababu UAE Important Tour : యూఏఈలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న

Exit mobile version