CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) యూఏఈలో పర్యటించనున్నారు. టూర్ లో భాగంగా మూడు రోజుల పాటు అధికారికంగా పర్యటించనున్నారు. యూఏఈ వెళ్లేందుకు అమరావతి నుంచి హైదరాబాద్ బయలు దేరారు సీఎం చంద్రబాబు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా దుబాయ్ వెళ్లనున్నారు. తొలిరోజు పర్యటనలో ఐదు సంస్థల ప్రతినిధులతో వన్ టు వన్ సమావేశాలు నిర్వహించనున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల ప్రతినిధులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. మ్యూజియం సందర్శనలో భాగంగా స్పేస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పరిశీలించనున్నారు చంద్రబాబు నాయుడు.
CM Chandrababu Important Tour
ఇదిలా ఉండగా రాత్రి సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొననున్నారు సీఎం. విశాఖలో ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనుంది సదస్సు. పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. యూఏఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. తన పర్యటనను పురస్కరించుకుని నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. పెట్టుబడిదారులు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Also Read : AP Rains Warning : ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన
