Bhatti Vikramarka : హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. కీలకమైన ఖనిజాల రంగంలో తెలంగాణ నాయకత్వాన్ని నీతి ఆయోగ్ గుర్తించడం జరిగిందని, ఇది మన రాష్ట్రానికి గర్వకారణం అని పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కు నేషనల్ క్రిటికల్ మినరల్స్ కమిటీలో స్థానం లభించిందని స్పష్టం చేశారు. ఇది తమ చురుకైన విధానాలు, జాతీయ స్థాయి పురోగతిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు మల్లు భట్టి విక్కమార్క.
DY CM Bhatti Vikramarka Key Comments
కీలకమైన ఖనిజాల అన్వేషణకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రపంచ భాగస్వాములతో (ఆస్ట్రేలియా, రష్యా, ఘనా) సహకరించినట్లు తెలిపారు. ఇటీవలి జాతీయ వేలంలో బంగారం, రాగి అన్వేషణ లైసెన్స్‌లను కూడా పొందామని వెల్లడించారు డిప్యూటీ సీఎం. NFTDC, IMMT, JNARDDC తో SCCL ఒప్పందాలు చేసుకున్నామని, అంతే కాకుండా NGEL తో చేసుకున్న గ్రీన్-ఎనర్జీ భాగస్వామ్యం రాబోయే కాలంలో దార్శనికతను మరింత బలోపేతం చేస్తాయని స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రమార్క.
SCCL, RVUNL సంయుక్త చొరవతో 2,300 MW థర్మల్ , సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను రాజస్థాన్ క్యాబినెట్ ఆమోదించడం పట్ల సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆ సర్కార్ కు డిప్యూటీ సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఇది రాజస్థాన్‌లోని సోలార్ వ్యాలీలో 1,500 MW సోలార్ ప్లాంట్‌ను వేగవంతం చేస్తుందన్నారు. ఇదే క్రమంలో మంచిర్యాలలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో 800 MW యూనిట్‌కు మార్గం సుగమం చేస్తుందన్నారు . సింగరేణి కంపెనీ లిమిటెడ్ ఇప్పుడు జాతీయ నమూనాగా అభివృద్ధి చెందుతోందన్నారు.
Also Read : Kavitha Strong Aggression : సమస్యల పరిష్కారం కోసమే జనం బాట
