Kavitha Strong Aggression : స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే జ‌నం బాట‌

స్ప‌ష్టం చేసిన జాగృతి అధ్య‌క్షురాలు క‌విత

Hello Telugu - Kavitha Strong Aggression

Hello Telugu - Kavitha Strong Aggression

Kavitha : రంగారెడ్డి జిల్లా : తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత (Kavitha) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోస‌మే తాను జ‌నంలోకి వ‌చ్చాన‌ని చెప్పారు. ఇందులో భాగంగానే జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాన‌ని తెలిపారు. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల‌లో ప‌ర్య‌టించాన‌ని తెలిపారు. ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నార‌ని, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నార‌ని వారు త‌మ గోడును త‌న‌తో వెళ్ల బోసుకుంటున్నార‌ని చెప్పారు. జ‌నం బాట‌లో భాగంగా సంక్షేమ హాస్ట‌ల్స్, స్కూళ్లు, ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు, హాస్పిట‌ల్స్ ను సంద‌ర్శించ‌డం జ‌రిగింద‌ని అన్నారు క‌విత‌.

Kavitha Comments on Problem Solving

ప్ర‌ధానంగా రిమ్స్, వ‌రంగ‌ల్ లోని ప్ర‌ధాన ఆస్ప‌త్రిలో క‌నీస వ‌స‌తి సౌక‌ర్యాలు లేక పోవ‌డం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని చెప్పారు. రాష్ట్రం ఏర్ప‌డి 10 ఏళ్లు పూర్తి అయిన‌ప్ప‌టికీ ఎక్క‌డి స‌మ‌స్య‌లు అక్క‌డే ఉన్నాయ‌ని వాటిని ప‌రిష్క‌రించేందుకు పాల‌కులు ప్ర‌య‌త్నించ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. గ‌త స‌ర్కార్ కొంత మేర‌కు ప్ర‌య‌త్నం చేసినా ప్ర‌స్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం వాటిని విస్మ‌రించ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తాజాగా జాగృతి జనం బాటలో భాగంగా షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

Also Read : Minister Azharuddin Important Update : మ‌క్కాలో అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

Exit mobile version