Minister Anitha : విజయవాడ : కోట్లాది భక్తుల కొంగు బంగారంగా వినుతికెక్కింది విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈసారి 20 లక్షల మందికి పైగా భక్తులు అమ్మ వారిని దర్శించుకుంటారని అంచనా. ఈ సందర్బంగా ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha) అమ్మ వారిని దర్శించుకున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. క్యూ లైన్లను పరిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను పరామర్శించారు. ఏర్పాట్లపై ఆరా తీశారు.
Minister Anitha Comments
అనంతరం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆమెకు
సాదర స్వాగతం పలికిన ఆలయ అధికారులు. కొలువుతీరిన దుర్గమ్మను దర్శించు కోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు వంగలపూడి అనిత. దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా కాపాడాలని కోరుకున్నానని తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయని ప్రశంసించారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు . పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కు శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నానని చెప్పారు అనిత.
ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్లపాటు ఉండాలని దుర్గమ్మను కోరుకున్నానని తెలిపారు. అంతే కాకుండా రాష్ట్రంపై సైకోల కళ్ళు పడకూడదని వేడుకున్నానని తెలిపారు.
Also Read : H-1B Effect- NRI’s Shocking : హెచ్ 1 బి ఎఫెక్ట్ ఎన్నారైలకు కోలుకోలేని షాక్
