H-1B Effect- NRI’s Shocking : హెచ్ 1 బి ఎఫెక్ట్ ఎన్నారైల‌కు కోలుకోలేని షాక్

సెల‌వులు, వివాహ యాత్ర‌లు సైతం ర‌ద్దు

Hello Telugu - H-1B Effect- NRI's Shocking

Hello Telugu - H-1B Effect- NRI's Shocking

H-1B : ఢిల్లీ : అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో నిర్ణ‌యం తీసుకుంటూ హ‌డ‌ల్ ఎత్తిస్తున్నారు. ప్ర‌ధానంగా ఆయ‌న కొలువు తీరాక ప్ర‌వాస భార‌తీయుల‌కు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఎప్పుడు ఎలాంటి వార్త వ‌స్తుందోన‌ని త‌ల్ల‌డిల్లుతున్నారు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి ఓ వైపు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌న మిత్రుడు అంటూనే ఇంకో వైపు భార‌త దేశాన్ని ట్రంప్ ల‌క్ష్యంగా చేసుకున్నాడు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా అమెరికా ఈజ్ ఫ‌స్ట్ ఆ త‌ర్వాతే ఏ దేశ‌మైనా అని ప్ర‌క‌టించాడు. అందులో భాగంగా వ‌చ్చీ రావ‌డంతోనే టారిఫ్స్ పెంచాడు. ఆపై నిత్యం ఇండియాను ల‌క్ష్యంగా చేసుకుని అవాకులు చెవాకులు పేలుతున్నాడు ట్రంప్. ఈ త‌రుణంలో పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు ఉన్న‌ట్టుండి హెచ్ 1 బి వీసా (H-1B) ఫీజు భారీగా పెంచుతున్న‌ట్లు వెల్ల‌డించాడు. గ‌తంలో వీసా ద‌ర‌ఖాస్తు రుసుము కేవ‌లం 1500 డాల‌ర్లు మాత్ర‌మే ఉండేది. దానిని ల‌క్ష డాల‌ర్ల‌కు పెంచాడు. దీంతో ఎన్నారైలు ల‌బోదిబోమంటున్నారు.

H-1B Effect

వీసా రుసుము పెంపు గందరగోళం మ‌ధ్య చాలా మంది భారతీయులు సెలవులను, వివాహ యాత్రల‌ను కూడా రద్దు చేసుకోవాల్సి వస్తోంది. జేపీ మోర్గాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రధాన కంపెనీలు విదేశాలకు వెళ్లే ఉద్యోగులు ఈనెల 21 గడువుకు ముందే తిరిగి రావాలని సూచించాయి. కొత్త నియమం చెల్లుబాటు అయ్యే వీసాదారులకు కూడా పునఃప్రవేశ పరిమితులతో ముడిపడి ఉన్నట్లు కనిపించడంతో, నవరాత్రి, దీపావళి, సంవత్సరాంతం సెలవులకు ప్రయాణించాల్సిన చాలా మంది భారతీయులు చివరి నిమిషంలో తమ ప్రణాళికలను రద్దు చేసుకున్నారు. ఇందులో భాగంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అయితే హెచ్ 1 బి హోల్డర్లు మునుపటిలా బయలుదేరి తిరిగి ప్రవేశించవచ్చ‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌ని, ఇది కొత్త వీసాలకు మాత్రమే వర్తిస్తుందన్నారు.

Also Read : Goa CM Interesting Comments : ఎంఎస్ఎంఈల‌కు గోవా స‌ర్కార్ స‌పోర్ట్

Exit mobile version